
AC Side Effects: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క పూట కూడా ఏసీ లేనిదే గడవడం లేదు. ఎండ వల్ల ఫాన్స్ కూలర్లు, ఏసీలు వేసుకొని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క నిమిషం కూడా ఇవి లేనిదే గడవడం లేదు. అయితే ఏసీ గదుల్లో ఎక్కువ సమయం పాటు ఉంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా తప్పవు. ప్రధానంగా రాత్రంతా ఏసీ వేసుకొని పడుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త..
ప్రస్తుత కాలంలో సిటీలతో పాటు గ్రామాల్లో కూడా ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఎంత వేడిమీ అంతలా ఉంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్ లేనిదే గడవడం లేదు. అయితే రోజంతా ఏసి వేసుకొని ఉంటున్నారు. ఇది మాత్రమే కాదు రాత్రి సంగతి చెప్పనక్కర్లేదు ఏసీ లేనిదే నిద్ర కూడా పట్టడం లేదు. ఇల్లు ఆఫీసుల్లో ఇదే పరిస్థితి. అయితే ఏసీ ఇలా ఎక్కువసేపు ఆన్ చేసి పడుకోవటం వల్ల మీకు ఐదు ప్రాణాంతక జబ్బులు రావచ్చు.
రాత్రంతా వేసి ఏసీ ఆన్ చేసి పడుకోవటం వల్ల కళ్లు పొడిబారి పోయే సమస్య వస్తుంది. దీంతో మీ ముక్కు కూడా పొడిబారి పోతుంది. ఎక్కువసేపు ఏసి కింద ఉండటం వల్ల చర్మం కూడా దురదలో వచ్చే అవకాశం కూడా ఉంది. మీ దృష్టి కూడా మసకబారే పరిస్థితిలు ఏర్పడతాయి.
ఇది మాత్రమే కాదు ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు ఇలా ఏసి రాత్రంతా వేసి పడుకోవడం వల్ల పరిస్థితి మారి ఇంత దిగజారుతుంది. ఎలర్జీ సమస్యలు ఉన్నవారి సంగతి చెప్పక్కర్లేదు. ఇది దగ్గు, జలుబు కూడా కారణమవుతుంది. ఒక్కోసారి ఛాతి బిగుతు కూడా దారితీస్తుంది. ఏసీ గాలి గదంతా వ్యాపిస్తుంది కాబట్టి ఏదైనా దుమ్ము ధూళి ఉంటే మీ ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
అలర్జీ సమస్య ఉన్న వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అంతేకాదు జుట్టులో చుండ్రు కూడా ఎక్కువగా పేరుకు పోతుంది. ఎలర్జీ ఉన్నవాళ్ళకు ఏసీలో ఉండటం వల్ల సమస్య ఎక్కువ అవుతుంది. తద్వారా ధూమ్మూ వల్ల జలుబు మాత్రమే కాదు చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి.
అంతేకాదు నిత్యం ఏసీ కిందనే ఉండడం వల్ల ఆ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. తద్వారా మిమ్మల్ని వైరల్ వ్యాధులు చుట్టుముట్టే అవకాశం కూడా ఉంది. చల్లని ఉష్ణోగ్రతలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఇలా జరుగుతుంది.
ఇక ఏసీలో నిత్యం ఉండటం వల్ల కండరాల నొప్పి సమస్యలు కూడా పుట్టుకువస్తుంది. చల్లగాలి కారణంగా కీళ్లనొప్పుల సమస్య పెరుగుతుంది. రెగ్యులర్ ఎక్ససైజ్ తప్పనిసరిగా చేయాలి. ఏసి ఆన్ చేసుకొని పడుకోవడం వల్ల మీకు నిద్రలేని సమస్య కూడా చుట్టూ ముడుతుంది. ఏసీ శబ్దం లేదా ఎక్కువ చలి వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe