Almonds VS Peanuts: నానబెట్టిన బాదం లేదా పల్లీలు.. రెండిటిలో ఏది గుండెకు ఆరోగ్యకరం..

Almonds VS Peanuts Benefits: నానబెట్టిన బాదం లేదా నానబెట్టిన పల్లీలు ఈ రెండిట్లో ఏది ఆరోగ్యకరం. సాధారణంగా ఏ గింజలైనా నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం అని అంటారు. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం నానబెట్టిన బాదం లేదా పల్లీలు రెంటిటిలో ఏది తీసుకుంటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం ..

Written by - Renuka Godugu | Last Updated : Apr 26, 2025, 11:08 AM IST
Almonds VS Peanuts: నానబెట్టిన బాదం లేదా పల్లీలు.. రెండిటిలో ఏది గుండెకు ఆరోగ్యకరం..

Almonds VS Peanuts Benefits: నానబెట్టిన గింజలు ఉదయం పూట తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమని అందులో ఉండే పోషకాలు మన శరీరానికి అందిస్తాయి. విటమిన్స్, ఖనిజాలు కూడా అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అందుకే రెగ్యులర్ డైట్ లో నానబెట్టిన గింజలు చేర్చుకోవాలని సూచిస్తారు. అయితే ఈ నానబెట్టిన గింజలు ఎన్నో రోజులుగా సాంప్రదాయంలో ఉంది. అయితే బాదం లేదా పల్లీలు రెండిట్లో ఏది ఎక్కువ ఆరోగ్.యం 

Add Zee News as a Preferred Source

నానబెట్టిన బాదంపప్పులో మోనోఅన్‌చురేటెడ్‌ కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్‌ ఇ ఉంటుంది. ఫైబర్ కూడా పుష్కలంగా ఉండటంతో మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించేస్తాయి. దీంతో మీ కార్డియో ఆరోగ్యం కూడా బాగుంటుంది. ప్రతిరోజు ఉదయం నానబెట్టిన బాదం పప్పులు తినాలి.

 ఇక నానబెట్టిన పల్లీలలో  ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది బరువు నిర్వహణలో ఉన్న వారికి మంచిది. ఇది కార్డియో ప్రమాదాన్ని తగ్గించే గుణం కూడా కలిగి ఉంటుంది. అందుకే వీటిని కూడా నానబెట్టి తీసుకోవచ్చు.

అయితే ఈ రెండిటిలో ఏది గుండె ఆరోగ్యానికి మంచిది. అంటే బాదంలో ఎక్కువ మొత్తంలో మోనో అన్‌శాచ్యురేటెడ్ కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఎక్కువ ఆరోగ్య కరం అవుతుంది. అయితే పల్లీల్లో కూడా స్ట్రోక్ తగ్గించే గుణం కలిగి ఉంటుంది. అయితే ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ రెండిటిని నానబెట్టి తీసుకోవాలి. ముందుగా వైద్యులను సంప్రదించి ఎంత మొత్తంలో తీసుకోవాలో సలహా పొందవచ్చు. 

ప్రధానంగా పల్లీలలో విటమిన్ ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ని తగ్గించేస్తాయి. ఇక యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ జుట్టు చర్మంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే వేరుశనగ అంటేనే పేదల బాదం అని పిలుస్తారు. ఇది తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. వీటిని సులభంగా నానబెట్టి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. వేరుశనగలో ఫైబర్, కొవ్వులు అధిక మొత్తంలో ఉంటాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది.ఇందులో గ్లైసెమిక్‌ సూచీ కూడా తక్కువగా ఉంటుంది డయాబెటిస్ వారికి మంచిది.

ఇదీ చదవండి:  పాకిస్తాన్‌ డీఎన్‌ఏలోనే ఉగ్రవాదం.. గొంతు కోస్తా అంటూ భారతీయులకు పాక్‌ అధికారి వార్నింగ్‌..

ఇదీ చదవండి: శరీరానికి ఉత్సాహాన్నిచ్చే శక్తివంతమైన పండు.. గుండె నుంచి మెదడు వరకు ఎంతో మేలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News