Soaked Coriander: కొత్తిమీరా నానబెట్టిన నీటిని తీసుకుంటే.. ఈ దీర్ఘకాలిక జబ్బులు ఫసక్‌..

Soaked Coriander Water Benefits: కొత్తిమీర నానబెట్టిన నీళ్లు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు. దీన్ని సిలాంట్రో అని కూడా పిలుస్తారు. ఇది ఒక ఆరోగ్యకరమైన మూలిక. దీంతో ప్రయోజనాలు మెండు. ఇది వివిధ కూరల్లో ఉపయోగిస్తాం.

Written by - Renuka Godugu | Last Updated : Mar 16, 2025, 11:01 AM IST
Soaked Coriander: కొత్తిమీరా నానబెట్టిన నీటిని తీసుకుంటే.. ఈ దీర్ఘకాలిక జబ్బులు ఫసక్‌..

Soaked Coriander Water Benefits: కొత్తిమీర నానబెట్టిన నీళ్లను రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. అంతేకాదు ఈ నీటిలో మన జీర్ణక్రియకు మెరుగుపరుస్తుంది. అంతే కాదు డిటాక్స్ ఫై చేస్తుంది. తరచూ ఈ నీటిని తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

రోజు రాత్రి పడుకునే ముందు కొత్తిమీర నానబెట్టిన నీళ్ళని తీసుకోవడం వల్ల ఇది దీర్ఘకాలిక మలబద్ద సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన పేగు కదలికలు కూడా తోడ్పడుతుంది. రోజు రాత్రి పడుకునే ముందు ఈ నీటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్ అదుపులో ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుంది. అంతే కాదు ఇందులో డిటాక్సిఫైంగ్‌ గుణాలు ఉంటాయి. మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. రక్తంలో చక్కెర రక్తాన్ని శుద్ధి చేసే గుణం కూడా కొత్తిమీర నీటిలో ఉంది.

బరువు తగ్గాలనుకునే వారు కొత్తిమీర నీటిని రెగ్యులర్గా తీసుకోవాలి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది. అంతేకాదు రెగ్యులర్ గా ఈ నీటిని తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. కడుపులో అజీర్తి, గ్యాస్ కూడా తగ్గిపోతుంది.

కొత్తిమీర నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సీజనల్‌ జబ్బులు రాకుండా కాపాడుతాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉంటాయి. రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన నరాల వ్యవస్థకు ఎంతో ఆవశ్యకం.

ఇదీ చదవండి:  అమ్మో.. చేప కొరికితే  చెయ్యి తీసేయాల్సి వచ్చింది.. అరుదైన ఇన్ఫెక్షన్ తస్మాత్‌ జాగ్రత్త..

కొత్తిమీర నీటిని తీసుకోవడం వల్ల మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి. అంతేకాదు బీపీ కూడా అదుపులో ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. ఈ నీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. దీంతో మన చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఆరోగ్యకరమైన మెరిసే ముఖం మీ సొంతం అవుతుంది.

రోజు రాత్రి పడుకునే ముందు ఈ కొత్తిమీర నీటిని తీసుకోవడం వల్ల ఇందులో మన శరీరంలో ఉన్న సోడియం ఇతర విష పదార్థాలను బయటకు పంపించేస్తాయి. దీంతో కిడ్నీలో రాళ్లు పేరు పోకుండా ఉంటాయి. అంతేకాదు ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ (UTI) సమస్యను కూడా తగ్గిస్తుంది. రెగ్యులర్గా ఈ ఆకుతో నానబెట్టిన నీళ్లను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇందులో పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మన శరీర ఆరోగ్యకరమైన పనితీరుకు సహాయపడతాయి.

ఇదీ చదవండి:  ఈ 2 వస్తువులు ఉంటే.. పాములు గంటకు 12 మైళ్ల స్పీడ్‌తో మీ ఇంటికి పరుగెత్తుకుని వస్తాయి..!

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News