Spinach Benefits: పాలకూర తింటున్నారా? ఇవి మీ కోసమే..

Spinach Benefits In Telugu: పాలకూర తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు వివిధ రకాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 5, 2025, 07:03 PM IST
Spinach Benefits: పాలకూర తింటున్నారా? ఇవి మీ కోసమే..

Spinach Benefits In Telugu: పాలకూర తినడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ ఆకు కూరను పోషకాల గనిగా కూడా పిలుస్తారు. ఇందులో శరీరానికి కావాల్సిన అద్భుతమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారంలా తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఆకు కూరలో విటమిన్ K, విటమిన్ A (బీటా కెరోటిన్ రూపంలో), విటమిన్ Cతో పాటు ఫోలేట్, మాంగనీస్ ఎక్కువ పరిమాణంలో శరీరానికి అందుతుంది. ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగించేదుకు సహాయపడుతుంది. ఇవే కాకుండా బాడీకి ఇతర లాభాలు కలుగుతాయి. 

Add Zee News as a Preferred Source

పాలకూర తినడం వల్ల కలిగే లాభాలు:
రోగనిరోధక శక్తి పెంచేందుకు:

పాలకూర(spinach benefits)లో విటమిన్ సిలో పాటు ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో లభించే విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇవి రక్తం పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరాన్ని బలోపేతం చేస్తుంది.

కంటి ఆరోగ్యానికి మేలు: 
పాలకూరలో విటమిన్ Aతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో లభించే విటమిన్ A కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో లభించే కొన్ని పోషకాలు కంటి సమస్యల నంచి విముక్తి కలిగించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. పాలకూరలోని లుటీన్‌తో పాటు జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు కంటిలోని మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది. కంటిశుక్లం వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా పాలకూర నివారిస్తుంది.

గుండె ఆరోగ్యానికి..: 
పాలకూరలో పొటాషియంతో పాటు నైట్రేట్లు అధిక మోతాదులో లభిస్తుంది. అలాగే ఇందులో పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో లభిస్తుంది.. ఇది రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పాలకూరలోని నైట్రేట్లు రక్త నాళాలను విస్తరణకు కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర గుండె జబ్బులు కూడా తొలగిపోతాయి. 

బరువును తగ్గించేదుకు: 
పాలకూరలో కేలరీలు తక్కువ మోతాదులో లభిస్తుంది. అలాగే ఇందులో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి.. బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు శరీరంలో చెడు కొవ్వును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఫైబర్‌ కూడా ఉంటుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా చేస్తుంది. 

Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News