Happy Sri Rama Navami Wishes In Telugu: చైత్రమాసంలో అందరి ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో శ్రీరామనవమి ఒకటి. ఈరోజు సాక్షాత్తు శ్రీరాముడే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి ఏడాది చైత్రమాసంలోని శుక్లపక్షం రోజున దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. హిందూ భక్తులంతా ఈరోజు శ్రీరాముడికి ఉపవాసాలు పాటిస్తూ ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు కూడా మీ తోటి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మేలు జరగాలని కోరుకుంటూ.. ఇలా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలపండి.
శ్రీరాముడి ఆశీస్సులు.. మీపై మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని.. ఈ పవిత్రమైన రోజున మీ జీవితంలో శాంతితో పాటు శ్రేయస్సు కలగాలని ఆ శ్రీరాముడిని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
ధర్మం, న్యాయం, నీతికి నిలువెత్తు నిదర్శనం శ్రీరాములు.. ఆయన ఆదర్శాలను పాటిస్తూ జీవితంలో కష్టాలు దాటుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ.. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
ఆ సీతారాముల కథ మనకు కర్తవ్య నిర్వహణ.. ఎన్నో విలువలు కూడిన ఈ కథ మనందరికీ ఆదర్శం..ఈ శ్రీరామనవమికి ఆ విలువలను గుర్తించుకుంటూ పండగను జరుపుకుందాం.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
సీతారాముల కళ్యాణం జరిగిన ఈ శుభదినాన, మీ జీవితంలో ఆనందం, అన్యోన్యత ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటూ మీ అందరికీ.. శ్రీరామనవమి శుభాకాంక్షలు..
శ్రీరాముని దివ్యమైన నామం..మన అందరి హృదయాలను ప్రశాంతంగా ఉంచాలి.. ఈ పండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభప్రదం కావాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
రాముని బాణం లక్ష్యాన్ని చేధించినట్లే.. మీ సంకల్పం కూడా విజయవంతం కావాలని ఆ శ్రీరాముడిని కోరుకుంటూ.. మీ మేలుకొనే ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు..
భక్తితో రాముని స్మరిస్తే.. జీవితంలో ఎలాంటి కష్టాలు ఆర్థిక సమస్యలైనా తొలగి పోవాల్సిందే.. ఈ శ్రీరామనవమి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ.. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
శ్రీరాముడి కరుణాకటాక్షాలు మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. మీ అందరికీ పేరుపేరునా శ్రీరామనవమి శుభాకాంక్షలు..
శ్రీరాముడి వంటి ధర్మాత్ముడు, సీతమ్మ వంటి సాధ్వి మనకు ఆదర్శం. వారిని స్మరిస్తూ.. ఈ శ్రీరామనవమి పండగ ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
ఈ శ్రీరామనవమి సందర్భంగా.. మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి..సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ..మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









