Rava Idli Recipe: రుచికరమైన రవ్వ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే దోశ, ఇడ్లీ, ఉప్మా సంగతే మర్చిపోతారు!

Suji Rava Idli Recipe: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే టిఫిన్ అంటే గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా. బయట హోటల్‌లో తిన్నా.. ఇంట్లో వండుకున్నా..ఎక్కువగా వీటినే తినడానికి మనం ఇష్టపడతాము. ఇప్పుడు ఓ కొత్త వంటను మీకు పరిచయం చేస్తున్నాము. 'అదే రవ్వ ఇడ్లీ'.

Written by - Harish Darla | Last Updated : Dec 5, 2025, 05:34 PM IST
Rava Idli Recipe: రుచికరమైన రవ్వ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఇది తింటే దోశ, ఇడ్లీ, ఉప్మా సంగతే మర్చిపోతారు!

Suji Rava Idli Recipe: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉదయాన్నే టిఫిన్ అంటే గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ, పూరీ, ఉప్మా. బయట హోటల్‌లో తిన్నా.. ఇంట్లో వండుకున్నా..ఎక్కువగా వీటినే తినడానికి మనం ఇష్టపడతాము. అయితే కొన్నిసార్లు వీటిలో ఏది వండాలో అని చాలా సార్లు అమ్మవాళ్లు తెగ ఆలోచిస్తుంటారు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా రోజూ వండే టిఫిన్స్‌ను కొంచెం క్రియేటివిటీతో ఆలోచిస్తే అవి అదిరిపోయే టేస్ట్‌ను ఇస్తాయి. ఇప్పుడు ఓ కొత్త వంటను మీకు పరిచయం చేస్తున్నాము. 'అదే రవ్వ ఇడ్లీ'.

Add Zee News as a Preferred Source

రవ్వ ఇడ్లీ తయారు చేయడానికి, మీరు ముందుగానే పిండి రుబ్బుకొని రెడీ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కువ సమయం అసలే అవసరం లేదు. ఈ రవ్వ ఇడ్లీని కేవలం 30 నిమిషాల్లో సులభంగా తయారు చేయోచ్చు. దీని తయారీ ఎంతో సులభమే కాకుండా ఇది ఆరోగ్యానికి మంచిది. 

రవ్వ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు..
రవ్వ ఇడ్లీ చేయడానికి మీకు బొంబాయి రవ్వ, పెరుగు మాత్రమే అవసరం. మీకు కావాలంటే, మీరు దోసకాయ, ముల్లంగి, క్యారెట్ వంటి కూరగాయలను కూడా ఆ మిశ్రమంలో కలుపుకోవచ్చు.

Also Read: Akhanda 2 Release: బాలయ్య 'అఖండ 2' రిలీజ్..ఈ వారం దాటితే కష్టమే! ఎంత నష్టం వస్తుందంటే?

తయారు విధానం.. 
ముందుగా ఓ గిన్నెను స్టవ్‌పై పెట్టి అందులో నూనె పోసి వేడి చేసి.. ఆ తర్వాత వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఎండు మిరపకాయలు, కరివేపాకుతో పాటు అవసరమైతే కొద్దిగా కొత్తిమీరను కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కావలసినంత రవ్వ వేసి, సువాసన వచ్చే వరకు వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, బాగా చల్లారనివ్వాలి. 

వేయించిన రవ్వ చల్లారిపోయ్యాక.. దోసకాయ, ముల్లంగి, సొరకాయ, క్యారెట్ తురుము కూడా కలుపొచ్చు. తరువాత ఈ తురిమిన కూరగాయలు, పెరుగును రవ్వతో కలిపి కావాల్సినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. అలా 15 నిమిషాల పాటు పిండిని పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకోని అందులో ఇడ్లీల మాదిరి పిండి వేసుకోని ఉడికించాలి. 10 నిమిషాల్లో మీకు కావాల్సిన రవ్వ ఇడ్లీ రెడీ అవుతాయి. ఈ విధంగా తయారు చేసిన ఇడ్లీలను కొబ్బరి చట్నీ, శనగవిత్తనాల చట్నీతో కలిపి తింటే రుచి అదిరిపోతుంది.

Also Read: Snake Repellent: పాముకు బద్ధశత్రువు ఈ మొక్క..ఇంటి ముందు ఇవి చూస్తే కిలోమీటరు దూరం పారిపోతాయి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు.  గత 7 ఏళ్ల అనుభవంతో ఇక్కడ 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

...Read More

Trending News