Mung Bean Health Benefits: ఎండాకాలంలో పెసలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి పుష్కలమైన పోషకాలను కలిగి ఉండటంతో పాటు షుగర్, బ్లడ్ ప్రెషర్ స్థాయిలను తగ్గించటంలో దోహదపడతాయి. ముఖ్యంగా ఎండాకాలంలో మనం చాలా రకాలుగా పెసలుని వాడుతూ ఉంటాము.. కానీ పెసలును ఎలా వాడితే మన ఆరోగ్యానికి మరింత మంచి చేకూరుస్తాయో చాలా మందికి తెలియదు. మీ కోసం రోజు వాడే పెసలుని ఎండాకాలంలో ఎలా వాడితో రక్తంలోని చక్కర స్థాయిలను, బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి ఇపుడు తెలుసుకుందాం..
ఎండాకాలంలో పెసలు తినడంలో వాడల్సిన విధానాలు:
పెసలు జ్యూస్
ఎండాకాలంలో పెసలును జ్యూస్‌గా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. పెసలును తరిగి, సరిపోయేంత ఉప్పు లేదా నిమ్మరసంతో కలిపి తాగడటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచటంతో పాటు.. శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
తయారుచేయడం:
కప్పు పెసలు, 1 నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు లేదా జీలకర్ర పొడి తీసుకొని అన్నిటిని గ్రైండర్ లో వేసి తిప్పాలి. వచ్చిన జ్యూస్ లో నిమ్మకాయ రసం కలిపి తాగండి.
పెసర్ల సలాడ్ పెసర్లను ఉడికించి, చల్లార్చి, వేరే తరిగిన కూరగాయలతో కలిపి, జీడిపప్పు, బెల్లం లేదా నిమ్మరసంతో రుచికరమైన సలాడ్ తయారుచేయండి. ఇది జీర్ణ వ్యవస్ధ, డయాబెటిస్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
పెసర్ల పచ్చడి
పెసర్లను ముద్దగా చేసి, ఉప్పు, నిమ్మకాయ, మిరియాల పొడి కొద్దిగా జీలకర్ర కలిపి పచ్చడి తయారుచేసి, దీనిని వేడి చేసి లేదా తక్కువగా నూనె పోప్ వేసుకొని వేడి వేడి అన్నంతో కలిపి తినవచ్చు. ఈ రకంగా చేసిన పెసర్ల పచ్చడి బీపీ, షుగర్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో చాలా వరకు సహాయపడుతుంది.
పెసర్ల వడలు
పెసర్లను గ్రైండ్ చేసి, వాటిని ఉప్పు, మిరియాలు, కొత్తిమీరతో కలిపి, కొద్దిగా నూనె వేసి వడలు చేసుకోవచ్చు. వీటిని తింటే చాలా తృప్తి కలిగించే ఆహారం అవుతుంది.
పెసర్లతో సూప్
ఎండాకాలంలో పెసలుతో చేసిన సూప్ మంచిది. పెసలులో నీళ్లు కలిపి సూప్ లా ఉడికించండి.. 70% ఉడికిన తరువాత దానిలో కొద్దిగా నూనె వాడి, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వేసి ఉడికించండి. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
పెసలును దంచి తినడం
ఎండాకాలంలోనే కాకుండా ఏ కాలంలో అయిన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి, పెసలును నేరుగా తరిగి తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పద్దతిలో పెసలును తినటం వలన ఎక్కువ పోషకాలు శరీరానికి లభిస్తాయి.
ఈ పద్దతులలో పెసలును తీసుకొవటం వలన ఎండాకాలంలో కూడా మీ శరీరం హైడ్రేట్ గా ఉంచటంతో పాటు.. శరీరంలోని చక్కర స్థాయిలు.. బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









