Sunflower Seeds Benefits In winter: పొద్దు తిరుగుడు విత్తనాలు ఆరోగ్యకరం. చలివేల ముఖం పొడిబారిపోతుంది. కాలుష్యం వల్ల చర్మం మాయిశ్చర్ కోల్పోతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు మన స్కిన్ రిపెయిర్ చేస్తాయి. అంతేకాదు ఇందులో జింక్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ముఖానికి మంచి పునరుజ్జీవనం అందిస్తాయి. సన్‌ఫ్లవర్ విత్తనాల్లో పోషకాలు కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి.
ఈ పొద్దు తిరుగుడు విత్తనాలను సాధారణంగా తినవచ్చు. లేదా వేయించి ఉప్పు వేసుకొని కూడా తీసుకోవచ్చు. పోహాతో కలిపి కూడా యాడ్ చేసుకుని తినాలి. మనం తీసుకునే ఫుడ్ సలాడ్లో కాస్త ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవచ్చు. ఏదైనా స్మూథీ తయారు చేసుకున్న అందులో బ్లెండ్ చేసుకోవచ్చు. పొద్దు తిరుగుడు విత్తనాలతో తయారు చేసిన లడ్డు. చిక్కీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇలా తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ లభిస్తుంది.
ఇక ఈ పొద్దు తిరుగుడు విత్తనాలు ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అందులో ఒక చెంచా తేనె కొద్దిగా గోరువెచ్చని పాలు వేసి రాత్రి అంతా నానబెట్టాలి. ఉదయం వాటిని మెత్తని పేస్టు మాదిరి గ్రైండ్ చేసి ముఖం, మెడ భాగంలో అప్లై చేసి ఓ అరగంట అలాగే ఉండనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న డెడ్ స్కిన్ తొలగిపోయి ముఖానికి మంచి మాయిశ్చర్ కూడా అందుతుంది. డ్రై స్కిన్ సమస్య తగ్గిపోతుంది.
పొద్దు తిరుగుడు విత్తనాలతో తయారుచేసిన నూనె కూడా అందుబాటులో ఉంటుంది. కొన్ని చుక్కలు తీసుకొని ముఖమంతా రబ్ చేసుకోవచ్చు. మనం స్నాక్ కూడా తయారు చేసుకోవచ్చు. దానిమ్మ గింజలు, కీరా, లెమన్ జ్యూస్ కొద్దిగా నల్ల ఉప్పు వేసుకొని ఈ పొద్దు తిరుగుడు విత్తనాలను పుదీనా వేసుకొని తీసుకోవచ్చు. ఇది మంచి సలాడ్‌లా తయారవుతుంది. ఈ సన్ ఫ్లవర్ విత్తనాలను గ్రైండ్ చేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం కొద్దిగా నీళ్లు కూడా వేసి రోటి ,పరాటా, అన్నంలో కూడా కలిపి తీసుకుంటారు.
పొద్దుతిరుగుడు విత్తనాలను అరటి పళ్ళు, ఖర్జూరం పాలతో పాటు బ్లెండ్ చేసి ఉదయమే మంచి డ్రింక్ కూడా తీసుకోవచ్చు. ఇలా చలికాలం పొద్దుతిరుగుడు విత్తనాలను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా పొందుతారు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ALso Read: పండుగ రోజు అందంగా మెరిసిపోవడానికి.. ఈ ఒక్క ఫేస్‌ప్యాక్ అప్లై చేయండి!
ALso Read: చలికాలం ఇలా చేస్తే సహజంగా పింక్ గ్లోయింగ్ స్కిన్ ఇంట్లోనే పొందుతారు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









