Tamarind Benefits: చింతపండులో విటమిన్ ఏ, విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి మేలు చేస్తుంది.. ఇది ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది.. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి ఆ వృద్ధాప్య సమస్యలు త్వరగా రాకుండా నివారిస్తుంది. చింతపండు పులుపు, తీపి రుచిలో ఉంటుంది, దీన్ని ట్యామరిండా ఇండికా అనే సైంటిఫిక్ నామం కూడా ఉంది. చింతపండు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు ఉంటాయి.. ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో చింతపండును ఎక్కువగా వినియోగిస్తారు.. అంతేకాదు లాటిన్ అమెరికా లాంటి ప్రదేశాల్లో కూడా కొన్ని రెసిపీల్లో ఈ చిన్న చింతపండు తప్పనిసరి.
చింతపండు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోని డైటరీ ఫైబర్ మలబద్దక సమస్యను నివారిస్తుంది. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది.. ఇందులో అధిక శాతం ఫైబర్ ఉంటుంది. కాబట్టి ఇది కడుపు నిండిన అనుభూతిని కూడా కల్పిస్తుంది. అంతేకాదు చింతపండు యాంటీ అల్సర్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. ఇందులో పాలీఫినోలిక్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ వల్ల కడుపు సమస్యలు రాకుండా ఉంటాయి.
చింతపండు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల యాంటీ ఏజింగ్ గుణాలు కలిగి ఉంటుంది. ఇది వృద్ధాప్య సమస్యలు త్వరగా కనిపించకుండా కాపాడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్ రాకుండా సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.. ముఖంపై ఉంటే మచ్చలు, గీతాలు కూడా తొలగిపోతాయి, చింతపండు నానబెట్టిన నీటితో జుట్టును కడుగుతారు.. ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల మంచి క్లెన్సింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
ఇదీ చదవండి: ఆధార్ కార్డు లాక్ చేయడం ఎలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ డేటా భద్రం..
వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు చింతపండు రెగ్యులర్గా తీసుకోవాలని ఇలా చేయటం వల్ల మంచి మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. కొవ్వు కూడా కరిగించేస్తుంది. ఇది కాకుండా చింతపండులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది.. కాబట్టి అదిగా అనారోగ్యకరమైన ఆహారాలు తినకుండా ఉంటారు ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది
చింతపండు తీసుకోకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి త్వరగా పెరగవు ఇందులో ఫైబర్ ఉంటుంది షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచింది. అయితే హైపోగ్లైసేమియాను తగ్గిస్తుంది. డయాబెటిస్ వారు చింతపండును తీసుకోవడం వల్ల ఇది సమతులం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా చింతపండు మేలు చేస్తుంది.. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి ప్రేరేపిస్తాయి. రెగ్యులర్‌గా చింతపండు తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి టిష్యూస్ కాపాడుతాయి.. జింక్, కాపర్ కూడా ఉంటుంది.
ఇదీ చదవండి: అమ్మ బాబోయ్.. BSNL ఏడాది ప్లాన్ మరీ ఇంత తక్కువ.. ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు బ్రో..
చింతపండుతో ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ సి ఉంటుంది.. సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. కొన్ని నివేదికల ప్రకారం ఇది మంచి నయం చేసే గుణాలు కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా క్యాన్సర్ వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ రాకుండా కాపాడుతుంది. చింతపండును చట్నీ రూపంలో తీసుకోవచ్చు.. జ్యూస్ కూడా తాగొచ్చు. కొన్ని రకాల క్యాండీలు కూడా అందుబాటులో ఉన్నాయి వీటిని తీసుకోవచ్చు. మనం చింతపండుతో పులిహోర తయారు చేసుకుంటాం. ఇది తీసుకోవటం వల్ల కూడా ప్రయోజనాలు మెండు. ఇవి కాకుండా కొన్ని రకాల కూరలు రెసిపీలో వినియోగించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









