Ginger And Coriander Seed Tea: ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి సాయంత్రం డిన్నర్ వరకు మనం తీసుకునే ఆహారం మన శరీరం పై ప్రభావం చూపుతుంది. అయితే ప్రతిరోజు ఉదయం చాలా మంది టీ, కాఫీలు తీసుకుంటారు. దీనివల్ల తలనొప్పి తగ్గుతుంది. అయితే ఆరోగ్యకరమైన డ్రింక్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ప్రధానంగా అల్లం ధనియాలు మన డైట్ లో చేర్చుకుంటే లెక్కలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. ఉదయం పరగడుపున ఈ రెండిటిని కలిపి టీ రూపంలో తయారు చేసుకొని తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాల జాబితా ఇదే.
బరువు తగ్గుతారు..
ఉదయం పరగడుపున అల్లం, ధనియాల పొడి కలిపిన నీటిని తీసుకోవటం వల్ల బరువు సులభంగా తగ్గిపోతారు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు వీటిని తీసుకోవాలి. ఎందుకంటే ఇది క్యాలరీ బర్న్ చేస్తుంది. అంతేకాదు కడుపు నిండిన అనుభూతిని కూడా ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. కాబట్టి వెంటనే ఆకలి వేయదు. అతిగా ఇతర అనారోగ్య ఆహారాలు తీసుకోకుండా ఉంటారు. అంతేకాదు ఇందులో వాడిన అల్లం మెటబాలిజం రేటును పెంచుతుంది.
జీర్ణ ఆరోగ్యం..
అల్లం, ధనియాలు కలిపిన నీటిని తీసుకోవటం వల్ల ఇది కడుపులో ఉన్న గ్యాస్, అజీర్తిని తగ్గించేస్తుంది. అంతేకాదు కడుపులో ఉబ్బసంగా ఉన్న ఇది చక్కని రెమ్మడీ. ఇది దీర్ఘకాలిక మలబద్ధక సమస్య కూడా చక్కని పరిష్కారం అని చెప్పాలి.
షుగర్ కంట్రోల్..
ఈ రెండిటిని కలిపిన తీసుకోవటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు చేస్తుంది. షుగర్ రక్తంలో సమతూలంగా ఉంటుంది. సడన్‌గా చక్కెర పెరగకుండా కాపాడుతుంది. అల్లం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచే గుణం కలిగి ఉంటుంది. దీన్ని తీసుకోవటం వల్ల డయాబెటిస్ పేషెంట్స్‌కు మంచిది .
READ ALSO: Passport: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఐర్లాండ్.. భారత్ స్థానం ఎంతకి పడిపోయిందంటే?
ఇమ్యూనిటీ బూస్ట్ ..
ఈ రెండు కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుణాలు ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. అంతేకాదు ఇది జలుబు, దగ్గు వంటి రొంప సమస్యలను తగ్గించేసి సీజనల్ జబ్బుల నుంచి మన శరీరాన్ని కాపాడతాయి.
డీటాక్స్ డ్రింక్ ..
అల్లం, ధనియాలు కలిపిన నీరు మంచి డిటాక్స్ డ్రింక్‌లా పని చేస్తాయి. మన శరీరంలో ఉండే విష పదార్థాలు బయటకు పంపిస్తుంది. అంతేకాదు అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీరాన్ని డిటాక్స్ ఫై చేస్తాయి. కిడ్నీలు, లివర్లను కూడా క్లీన్స్ చేస్తాయి. తద్వారా మనకు తక్షణ శక్తి అందెడమే కాకుండా రోజంతటికి కావాల్సిన శక్తి అందిస్తుంది.
READ ALSO: Almonds VS Walnuts: నానబెట్టిన బాదం లేదా వాల్నట్స్ రెండిట్లో ఏది బెట్టర్ ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









