Medicine Usage: బీ అలెర్ట్.. ట్యాబ్లెట్స్ వేసుకున్నాక ఈ పనులు చేస్తున్నారా..? జాగ్రత్త సుమీ.. కొత్త రోగాలకి వెల్‌కమ్ చెప్పినట్టే..!

Medicine Usage: ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్నారు. వాటి నివారణ కోసం ట్యాబ్లెట్స్‌ను కూడా వాడుతుంటారు. అయితే, ట్యాబ్లెట్స్ వాడటం వల్ల రోగాలకు నివారణ దొరుకుతుంది కానీ.. అవి వేసుకున్న తరువాత కొన్ని కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. అవి చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తి మళ్లీ కొత్త రోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ట్యాబ్లెట్స్ వేసుకున్నాక చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.  

Written by - Aruna Maharaju | Last Updated : Jan 22, 2026, 07:10 PM IST
Medicine Usage: బీ అలెర్ట్.. ట్యాబ్లెట్స్ వేసుకున్నాక ఈ పనులు చేస్తున్నారా..? జాగ్రత్త సుమీ.. కొత్త రోగాలకి వెల్‌కమ్ చెప్పినట్టే..!

Tablet Usage Tips: ప్రస్తుత కాలంలో చాలా మంది అనేక రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సతమతమవుతున్నారు. వాటి నివారణ కోసం ట్యాబ్లెట్స్‌ను కూడా వాడుతుంటారు. అయితే, ట్యాబ్లెట్స్ వాడటం వల్ల రోగాలకు నివారణ దొరుకుతుంది కానీ.. అవి వేసుకున్న తరువాత కొన్ని కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. అవి చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తి మళ్లీ కొత్త రోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి, ట్యాబ్లెట్స్ వేసుకున్నాక చేయకూడని కొన్ని పనుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ట్యాబ్లెట్స్ వేసుకున్నాక చేయకూడని పనులు ఇవే..

1. కాఫీ, టీ లేదా కోలా తాగకూడదు
కొంతమందికి మందులు వేసుకొని టీ, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల రక్తంలో కెఫిన్ స్థాయి పెరుగుతుంది. ఇది హృదయ స్పందన వేగంగా మారడానికి, ఉద్వేగానికి గురవ్వడం, నిద్రలేమి, టెన్షన్ లాంటి కొత్త సమస్యలకు దారి తీస్తుంది.

2. మద్యం సేవించకూడదు 
మనలో చాలా మంది మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, మానసిక ఆరోగ్య మందులు వేసుకొని మద్యం తాగడం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో తీవ్రమైన రియాక్షన్లకు దారి తీస్తాయి. ముఖ్యంగా లివర్ మీద అధిక ఒత్తిడి కలుగుతుంది. బ్లడ్ ప్రెజర్ తక్కువ కావడం, ఉబ్బసం, బలహీనత, మూర్ఛ, లివర్ డ్యామేజ్ వంటివి జరిగే ప్రమాదం ఉంది.

3. ఎక్కువ కారం తినకూడదు
మందులు తీసుకున్నాక ఎక్కువ మసాలా, కారంగా ఉండే ఆహారం అస్సలు తినకూడదు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు కలుగుతాయి. గ్యాస్ట్రిక్, యాసిడిటీ, అజీర్ణం, వాంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

4. ఖాళీ కడుపుతో  ట్యాబ్లెట్ వేసుకొని పని చేయకూడదు 
ఖాళీ కడుపుతో కొన్ని రకాల మందులు తీసుకుంటే మానవ శరీరంపై తీవ్ర ప్రభావం కలుగుతుంది. వాంతులు, నొప్పులు, అసహనం, ఉబ్బసం కూడా రావచ్చు.

5. డ్రైవింగ్ చేయకూడదు 
కొన్ని రకాల మందులు తీసుకొని వాహనాలు నడపడం అస్సలు చేయకూడదు. నిద్ర మందులు, ఒత్తిడి తగ్గించే మందులు, మూడ్ స్టాబిలైజర్లు వాడిన తర్వాత డ్రైవింగ్ చేయడం వల్ల అనుకోని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, మూర్ఛ వచ్చే ప్రమాదం ఉంది.

6. ఎక్సర్‌సైజ్ చేయకూడదు 
మందులు తీసుకున్న వెంటనే వ్యాయామం చేస్తే, అది హార్ట్ రెటును ప్రభావితం చేయవచ్చు. డీహైడ్రేషన్, వాంతులు, తలనొప్పి, బలహీనత వచ్చే ప్రమాదం ఉంది.

Also Read: Black Garlic: తెల్ల వెల్లుల్లి కంటే 'నల్ల వెల్లుల్లి' చాలా పవర్‌ఫుల్.. ఎందుకో తెలుసా..?

Also Read: Semiya Pakodi: సేమియాతో రొటీన్‌గా పాయసం, ఉప్మా బోర్ కొట్టట్లేదా..? ఇలా టేస్టీగా కరకరలాడే పకోడీ చేసేసుకోండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News