Himalayan Trip: చలికాలం కావడంతో కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా ఉత్తర భారతంలో అనేక చోట్ల ఉష్ణోగ్రతలు సున్నాదగ్గరికి చేరుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. ఇలాంటి సమయంలో మీరు షిమ్లా, మనాలీ, ముస్సోరి వంటి హిల్ స్టేషన్స్‌కు వెళ్లాలి అని ప్లాన్ చేస్తోంటే.. మంచి ప్లానింగ్‌ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే హిమపాతం అనేక ఆపదలకు, ఇబ్బందులకు కారణం అవ్వవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING



Also Read | Nature Wonders: 5 Colors లో ప్రవాహించే నీటి ధారా.. నేచురల్ వండర్
1.ఉష్ణోగ్రతలు చెక్ చేయండి..
ప్రస్తుతం మనాలి (Manali), షిమ్లా, ముస్సోరీలో మంచు పడుతోంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రత మైనస్‌ పాయింట్‌కు చేరుకుంటుంది. అందుకే మీరు వెళ్లబోయే తేదీల్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి.


2.సంసిద్ధత...
సిమ్లా, మనాలి, ముస్సోరి వంటి ప్రాంతాల్లో మంచు ఎప్పుడు పడుతుందో చెప్పేలేము. పర్వత శ్రేణుల నడము హిమపాత (Snowfall) సోయగాలు చేయడానికి వెళ్లే సమయంలో బట్టలతో పాటు ఎలక్ట్రిక్ కెటిల్, సూప్ ప్యాకెట్స్ వంటివి సేఫ్ సైడ్‌గా తీసుకెళ్తే హోటల్స్‌లో మీకు ఫుడ్ నచ్చకపోతే ఆ పూట పనికానియోచ్చు. 


ALSO READ|  Myster of Tardigrade: ఇదోక మొండి జీవి...కరువు, వరదలు, మంచు తుపానులు కూడా ఏమీ చేయలేవు
3.స్నో డ్రెస్, షూస్
తరచూ మంచు ప్రదేశాల్లో వెళ్తుంటే మీరు స్నో షూస్ కొనుక్కోవాలి. లేదంటే మీరు అద్దెకు కూడా తీసుకోవచ్చు.


4.కార్ నెంబర్ వంటి వివరాలు..
దట్టమైన మంచు కురిసే కొండల మధ్యకు వెళ్తే ఫోన్ నెట్వర్క్ ఉండకపోవచ్చు. అందుకే మీ క్యాబ్ డ్రైవర్ ఫోటో, కార్ నెంబర్, పికప్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోవాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook