)
Desi fruits For weight loss: బరువు తగ్గాలనుకునే వారు కొన్ని రకాల ఫ్రూట్ జ్యూసులు డైట్లో చేర్చుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. కొన్ని రకాల ఫైబర్ విటమిన్స్, ఖనిజాలు కలిగి ఉంటుంది. ఇవి ఫ్యాట్ బర్న్ చేస్తాయి. వీటితో సులభంగా బరువు తగ్గొచ్చు.
ఆమ్ పన్న
ఆమ్ పన్న ఎండాకాలంలో ఎక్కువగా తీసుకుంటారు. ఇది మంచి హైడ్రేషన్ అందిస్తుంది. ట్యాంగీ ఫ్లేవర్ లో కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఇందులోనే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లో మెటబాలిజం రేటును పెంచి కొవ్వును కరిగిస్తాయి ఇందులో ఎక్కువగా షుగర్ కూడా ఉండదు పేగు ఆరోగ్యానికి మంచిది బరువు ఈజీగా తగ్గిపోతారు
జామున్ జ్యూస్..
సాధారణంగా డయాబెటిస్ వారికి మంచిదంటారు. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను మెరుగు చేస్తుంది. క్యాలరీలు తక్కువగా కలిగి ఉంటాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళు జామున్ జ్యూస్ తీసుకోవడం వల్ల మంచి జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది తిన్న తర్వాత తీసుకోవటం వల్ల కూడా కొవ్వు కరిగిపోతుంది.
దానిమ్మ రసం..
దానిమ్మ రసం మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఇందులోని పాలిఫైనల్స్ ఫ్యాట్ ని కరిగించేస్తాయి. అంతేకాదు ఇది ఇన్సూలిన్ నిరోధకత కూడా సహాయపడతాయి. రెగ్యులర్ గా చూసి తీసుకోవటం వల్ల కడుపు నిండిన అనుభూతి కూడా కలుగుతుంది. తద్వారా అతిగా తినకుండా ఉంటారు. బరువు తగ్గిపోతారు.
మోసంబి జ్యూస్ ..
మోసంబి జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా ఇది పుల్లగా తీయగా ఉంటుంది. ఇది కాలేయాన్ని శుభ్రం చేసేస్తుంది. అంతేకాదు ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. ఇది మన వెయిట్ లాస్ జర్నీ కూడా ఎంతో మంచిది. త్వరగా బరువు తగ్గిపోతారు. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ సి ఉంటుంది. మన శరీరానికి మంచి హైడ్రేషన్ కూడా అందిస్తుంది
పైనాపిల్
పైనాపిల్ పన్నా కూడా మంచి రుచిగా తీయగా పుల్లగా ఉంటుంది. ఇందులో బ్లాక్ సాల్ట్ వేసుకొని తీసుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది. ఇందులో బ్రోమలైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది. ఇందులో బ్రోమలైన్ అనే ఎంజాయ్ తగ్గడానికి సహాయపడుతుంది. ఇవి మాత్రమే కాదు స్టార్ ఫ్రూట్ జ్యూస్ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇందులో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో చక్కర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా కాపాడుతుంది. ఇది ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి మంచిది. ఒక గ్లాస్ స్టార్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook