How To Manage Mental Health: బలహీనత.. మనలో ప్రతి ఒక్కరికి ఏదొక బలహీనత ఉంటుంది. మనలో ఉన్న బలహీనతలు బయట వారికి తెలిస్తే.. అది అదునుగా చేసుకొని అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఒత్తిడికి లోనయి.. చాలా మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. కానీ.. మీలో ఉన్న నలహీనతలను దాచి ఉంచటం కన్నా.. వాటిని జయించి.. మానసికంగా మరింత బలోపేతంగా మారటమే మీ విజయానికి చేరువచేస్తుంది. ఈ అలవాట్లని మీ అలవాట్లుగా మార్చుకుంటే.. తిరుగులేని మానసిక శక్తిని ఆపాదించుకొని మారుతున్న ఈ కాలానికి అనుగుణంగా మరింత పటిష్టంగా తయారవుతారు.
1. నెగటివ్ ఆలోచనలకు దూరం..
మానసిక బలహీనతలలో ప్రధానమైనది ఆత్మన్యూనత భావన. వీలైనంత త్వరగా దీనిని తొలగించుకోవాలి.
ఈ ప్రపంచంలో ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని.. పరిష్కారం లేని సమస్య అంటూ లేదని తెలుసుకోండి..
"నేను చేయగలను" అనే ధైర్యాన్ని కలిగించుకునేలా ప్రతిరోజూ సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి.
2. భయాలను ఎదుర్కొండి..
ఎంతటి సమస్య ఎదురైనా భయానికి లోనుకాకండి, భయాన్ని ఎదుర్కొండి. మీరు ఏదైనా కొత్త పని మొదలుపెట్టాలనుకునే సమయంలో భయం వస్తే, ఆ పనినే పక్కగా ప్రారంభించండి. ప్రతి రోజు మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఛాలెంజ్‌లను స్వీకరించండి. ఇవే మీ మానసిక బలాన్ని పెంచుతాయి.
3. క్రమశిక్షణ & సంకల్పం
విజయానికి మొదటి మెట్టు క్రమశిక్షణ.. క్రమశిక్షణ పాటించే వ్యక్తులే విజయ శిఖరాలను అధిరోహిస్తారు.
ఎదురుకాబోయే కఠిన పరిస్థితులలో నిలబడే శక్తి కోసం నిశ్చయాన్ని పెంపొందించుకోండి. ప్రతి రోజు మీరు పాటించాల్సినవి బుక్ పైన రాసుకొని.. వాటిని అమలు చేయడాన్ని ఒక అలవాటు మార్చుకోండి.
4. ఇతరులతో పోల్చుకోవద్దు..
మీ ప్రయాణం.. మీ గమ్యం.. మీది మాత్రమే.. ఇతరులతో పోల్చుకోవడం మనలో మానసిక బలహీనతను పెంచుతుంది. మీ గతాన్ని.. మీ ప్రామాణికంగా ఉంచుకోండి. నిన్నటి కంటే ఈరోజు మీరు మెరుగ్గా ఉన్నారా..? లేదా..? అన్నదే ముఖ్యం.
5. సమస్యలపై కాకుండా పరిష్కారాలపై దృష్టి
ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని నమ్మండి. కానీ మీరు దేని మీద దృష్టి సారిస్తున్నారనేదే ముఖ్యం.
"ఇదెందుకు జరిగింది..?" అని కాకుండా, "దీన్ని ఎలా పరిష్కరించాలి..?" అనే దృక్పథాన్ని పెంచుకోండి.
6. అనవసరమైన భావోద్వేగాకు దూరంగా ఉండండి
కోపం, బాధ, అసూయ.. ఇవన్నీ మానసిక బలాన్ని దెబ్బతీస్తాయి. ఎప్పుడైతే మనం మన భావోద్వేగాలను నియంత్రించగలుగుతామో, అప్పుడే తిరుగులేని శక్తిగా ఎదుగుతాము. ప్రతి దానికి ప్రశాంతంగా స్పందించడం నేర్చుకోండి.
7. ధ్యానం..
ప్రతి రోజు కనీసం 10 నిమిషాలు పాటు ధ్యానం చేయండి. మైండుఫుల్‌గా ఉండండి.. అంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించటం.. గతాన్ని తలుచుకొని బాధపడకుండా, అలా అని భవిష్యత్తుకు భయపడక జీవించడం.
ఇది మానసిక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.








