Collagen Foods: ఈ 5 కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!

Collagen Increase Foods: మీ ముఖానికి సహజంగా కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు. అందమైన ముఖం కావాలని అందరూ కోరుకుంటారు. పై నుంచి క్రీములు అప్లై చేసే విధానం ఒకవైపు.. లోతైన పోషణ కూడా అందించడం ముఖ్యం. కాంతివంతంగా మెరుస్తూ నిత్య యవ్వనంగా కనిపించాలంటే కొల్లాజెన్‌ ఉత్పత్తి తప్పనిసరి. కొల్లాజెన్‌ బూస్ట్‌ చేసే ఫుడ్ తీసుకోవాలి. అయితే ఐదు రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల నేచురల్ గా ప్రతిరోజు మీ ముఖం, చర్మం, జుట్టుకి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి.

Written by - Renuka Godugu | Last Updated : Dec 11, 2025, 04:39 PM IST
Collagen Foods: ఈ 5 కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే పండ్లు.. ఎలాంటి క్రీములు అవసరం లేదు..!

Collagen Increase Foods: కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ ముఖం సహజంగా మెరుస్తుంది. ప్రతిరోజు మనం తీసుకున్న ఈ ఐదు పండ్ల వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. తద్వారా ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. మచ్చలు, గీతలు తొలగిపోతాయి. కొల్లాజెన్‌ ఉత్పత్తి లేకపోతే ముఖం జీవం లేకుండా కోల్పోతుంది. మనం తీసుకునే డైట్ లో కొల్ల ఉత్పత్తికి తోడ్పడే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఫుడ్స్ మాత్రం తీసుకోవాలి. అలాంటి ఐదు రకాల పండ్లు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం..

Add Zee News as a Preferred Source

ఆరెంజ్..
ఆరెంజ్ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది పోషకాలకు పవర్‌హైస్‌. ఒక సాధారణ ఆరెంజ్ తీసుకోవడం వల్ల 70 మిల్లీగ్రాముల విటమిన్ సీ కూడా అందుతుంది. ఇది రెగ్యులర్‌గా కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. విటమిన్ సి సహజంగా ముఖం కాంతివంతం కావడానికి తోడ్పడుతుంది.

కీవీ..
కీవీ పండు లో 64 మిల్లీ గ్రామీల విటమిన్ సీ ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అయితే మనం కీవీ పండు తీసుకోవటం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది. అంతేకాదు కీవీ పండులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్, చర్మానికి మేలు చేస్తాయి. సూర్యుని హానికర కిరణాలు, స్ట్రెస్‌కు గురైన చర్మానికి ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీ..
స్ట్రాబెర్రీ పండ్లు తీసుకోవడం వల్ల కూడా చర్మానికి మంచిది. ఒక అరకప్పు కట్ చేసిన స్ట్రాబెరీ పండ్లు రోజు తీసుకోవాలి. ఇందులో విటమిన్ సీ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఒక కప్పు స్ట్రాబెరీ పండ్లలో 89 మిల్లీ గ్రాముల విటమిన్ సీ ఉంటుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడి ఆక్సిడేషన్ బారిన పడకుండా కాపాడుతుంది.

బొప్పాయి..
బొప్పాయిలో కూడా విటమిన్ సీ పప్పెయిన్‌ అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ముఖంపై ఉండే మంట సమస్యను కూడా తగ్గిస్తుంది. విటమిన్ సి ఉంటుంది కాబట్టి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. రెగ్యులర్‌గా బొప్పాయి పండు తీసుకోవటం వల్ల ఇందులో విటమిన్ సీ 88 మిల్లీగ్రాములు ఉంటుంది. ఇందులో బీటా కెరోటీన్‌ కూడా కొల్లాజెన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది.

బెర్రీ పండ్లు..
బెర్రీ జాతికి చెందిన బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ పండ్లు కూడా ఎక్కువ మోతాదులో విటమిన్ సీ ఉంటుంది. ఇది ముఖానికి కాంతివంతంగా మారుస్తుంది. పిగ్మెంటేషన్ సమస్య తగ్గించి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఫ్రీ రాడికల్ వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది .కాబట్టి ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.

ఇవి కొల్లాజెన్‌ ఉత్పత్తికి తోడ్పడే ఈ పండ్లు తీసుకోవడం వల్ల సహజంగా మీ ముఖం లోపలి నుంచి మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ముఖంపై ఉండే పిగ్మెంటేషన్ సమస్య తగ్గిపోతుంది. దీంతో పాటు బయటకు వెళ్లినప్పుడల్లా ముఖానికి సన్‌స్క్రీన్‌ అప్లై చేసుకోవాలి. తద్వారా హానికర సూర్య కిరణాల నుంచి స్కిన్‌ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.

Read more: 36 ప్లాట్‌ఫారమ్స్‌.. 20 ఎంట్రీ గేట్లతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ రైల్వేస్టేషన్‌.. భారత్‌, చైనా, యూఎస్‌ కాదు..!

Read more: మా ఇంధనం యూఎస్ కొనొచ్చు.. ఇండియా కొనకూడదా? పెద్దన్నను ఎండగట్టిన పుతిన్..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News