Sesame Seeds Amazing Benefits: నువ్వు రెగ్యులర్‌గా మన డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందుతాయి. ఇది మన భారతీయ వంటల్లో విరివిగా ఉపయోగిస్తారు. అంతే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నువ్వులు ఎక్కువ మొత్తంలో ఉపయోగిస్తారు. అయితే నువ్వులు మన డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందాం ..
నువ్వులలో ఖనిజాలు పుష్కలం. ఇది పోషకాలకు పవర్ హౌస్. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, విటమిన్స్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది మనకు సమతుల ఆహారం అవుతుంది
నువ్వుల మన రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే మోన్‌అన్‌శాచురేటెడ్ కొవ్వులు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అదనంగా ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది మంట, వాపు సమస్యను తగ్గించేసి కార్డియో పనితీరుకు మెరుగు చేస్తుంది.
నువ్వులు తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. కాల్షియం తక్కువ ఉన్నవాళ్లు నువ్వులు తీసుకోవాలి. నువ్వులని డైట్ లో చేర్చుకోండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్, మంట నుంచి తగ్గించేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్ సెల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆస్టీయోపోరోసిస్ నుంచి కాపాడుతుంది. దీంతో ప్రాణాంతక జబ్బులు మన దరిచేరవు.
నువ్వులలో జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడే గుణాలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. మలబద్దక సమస్యకు ఎఫెక్టీవ్ రెమిడీ అని చెప్పొచ్చు. నువ్వులు డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యకరం. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. నువ్వులతో నూనె తయారు చేసింది జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇందులో విటమిన్ ఇ, యాంటీ యాసిడ్స్ జుట్టుకు మంచి మాయిశ్చర్ అందిస్తుంది. దీంతో చుండ్రు రాదు, హెయిర్ ఫాల్ సమస్య ఎప్పుడూ ముఖానికి అప్లై చేయడం వల్ల కాంతివంతంగా మారుతుంది.
ఇదీ చదవండి: అత్తపై కోడలి దాష్టీకం.. వృద్ధాశ్రమానికి వెళ్లలేదని.. వీడియో వైరల్..
నువ్వులు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల రక్తంలో హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. ఇది డయాబెటిస్ కి మంచిది. ఇన్సులిన్ నిరోధకతను మెరుగు చేస్తున్న ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో గ్లైసెమిక్ సూచీ కూడా తక్కువ మోతాదులో ఉంటుంది
ఇదీ చదవండి: నేటి రాశిఫలాలు.. ఈరాశికి కుటుంబ సమస్యల నుంచి కాస్త ఉపశమనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









