)
Vitamin E Rich Foods: విటమిన్ ఇ కూడా మన శరీరానికి ఎంతో ముఖ్యం. మన శరీరానికి విటమిన్స్, ఖనిజాలు పుష్కలంగా అవసరం. అయితే విటమిన్ ఇ కూడా ఎంతో ముఖ్యం. ఈ విటమిన్ మన శరీరంలో తగ్గుతే చేతుల్లో, కాళ్లలో బలహీనత ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. అయితే విటమిన్ ఇ లేమిని తగ్గించుకోవడానికి కొన్ని రకాల పండ్లు, కూరగాయలు మన డైట్ లో చేర్చుకోవాలి అవేంటో తెలుసుకుందాం..
కివి..
కీవీ పండు తీసుకోవటం వల్ల విటమిన్లు ఏమైనా అధిరోహించవచ్చు. మీరు విటమిన్ ఇ లేమితో బాధపడుతున్నట్లయితే రెగ్యులర్ గా కీవీ పండును తీసుకుంటే మంచిది. ఇది ఇమ్యూనిటీని కూడా బలపరుస్తుంది. తద్వారా సీజనల్ జబ్బులు రాకుండా కాపాడతాయి.
బొప్పాయి..
బొప్పాయిలో కూడా విటమిన్ ఇ, సి, ఏ కూడా ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు ఉంటాయి. జీర్ణ ఆరోగ్యానికి బొప్పాయి ఎంతో మంచిది. ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
అవకాడో..
అవకాడోలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మెరిసే చర్మానికి ఎంతో మంచిది. అవకాడో రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. శరీరారోగ్యానికి మంచిది. మీ చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది.
పాలకూర..
పాలకూర లో కూడా విటమిన్ ఇ ఉంటుంది. ఇందులో ఐరన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీని డైట్ లో చేర్చుకోవడం వల్ల విటమిన్ ఇ లేమితో బాధపడ్డ వారికి మంచిది. ఇది ఏ సమస్యలు మన దరిచేరకుండా ఉంటుంది.
బ్రోకోలి..
బ్రోకోలి మన శరీర ఆరోగ్యానికి మంచిది. రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం వల్ల మంచిది. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి మంచిది. బ్రోకోలీలో కర్రీ లేదా సూప్ కూడా తయారు చేసుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook