Turmeric Milk Facts: పసుపు పాలతో బంపర్‌ బెనిఫిట్స్‌.. తాగితే జరిగేది ఇదే!

Turmeric Milk Benefits: ప్రతి రోజు పసుపు పాలు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను తొలగించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 21, 2025, 05:48 PM IST
Turmeric Milk Facts: పసుపు పాలతో బంపర్‌ బెనిఫిట్స్‌.. తాగితే జరిగేది ఇదే!

Turmeric Milk Benefits: పసుపు పాలు రోజు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో సంతృప్త కొవ్వులతో పాటు ఫైబర్, విటమిన్ డి, పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ పసుపు కలిపిన పాలు తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఇందులో ఉండే కుర్కుమిన్ కీళ్ల నొప్పులను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇవే కాకుండా శరీరానికి ఇతర లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

పసుపు పాలు తాగడం వల్ల కలిగే లాభాలు:
కీళ్ల నొప్పులు, వాపుల సమస్యలు: 

పసుపులో ఉండే కుర్కుమిన్ అనే పదార్థాలు వాపును నియంత్రించేందుకు క్రియశీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కీళ్లనొప్పులతో పాటు ఎముకలకు సంబంధించిన నొప్పులను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా ఈ పాలు తాగడం వల్ల ఇతర లాభాలు కూడా కలుగుతాయి. 

మంచి నిద్రకు : 
రాత్రి నిద్రపోయే ముందు పసుపు పాలు తాగడం ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఇలా తాగడం వల్ల మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఆందోళన, ఒత్తిడి సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. ముఖ్యంగా నాడీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

రోగనిరోధక శక్తి: 
పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్‌తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పసుపులో ఉండే గుణాలు ఇతర సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

మెదడు పనితీరు: 
పసుపు పాలలో ఉండే వివిధ రకాల పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో లభించే కుర్కుమిన్ న్యూరాన్ కణాలను పెరుగుదలను ప్రోత్సహించడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. 

జీర్ణక్రియ సమస్యలు: 
పసుపు పాలు రోజు తాగడం వల్ల ప్రేగు కదలికలు మెరుగపడతాయి. అంతేకాకుండా మలబద్ధకం, పొట్ట సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే గ్యాస్ట్రిక్‌ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా బాడీ నొప్పులు కూడా పూర్తిగా తగ్గుతాయి. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News