Mango For Diabetes: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా?

Mango For Diabetes Patients: చాలా మంది మామిడ పండ్లపై అనేక సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని తినొచ్చా? అనేది పెద్ద సందేహం.. వీటిని డయాబెటిస్‌ ఉన్నవారు తినడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 16, 2025, 06:26 PM IST
Mango For Diabetes: మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా?

Mango For Diabetes Patients In Telugu: ప్రస్తుతం చాలా మందికి మామిడి పండ్లు మధుమేహం ఉన్నవారు తినవచ్చా? అనే విషయంపై అనేక సందేహాలు ఉన్నాయి. నిజానికి మామిడి పండ్లు అద్భుతమైన రుచిని కలిగి ఉండడమే కాకుండా అనేక పోషక విలువలు ఉంటాయి. ఇందులో సహజ చక్కెర కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి వీటిని సాధారణ వ్యక్తులు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఇందులో లభించే వివిధ రకాల పోషకాలు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారు వీటిని తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

మామిడి పండులోని పోషకాలు:
మామిడి పండులో విటమిన్లు A, C, E, K పుష్కలంగా లభిస్తాయి. ఇందులో లభించే వివిధ రకాల పొటాషియం, మెగ్నీషియం ఖనిజాలు, ఫైబర్‌తో పాటు యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని అందించేందుకు, రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. దీంతో పాటు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 100 గ్రాముల మామిడి పండులో సుమారు 60 నుంచి 70 కిలో కేలరీలు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి క్రమం తప్పకుండా తినడం చాలా మంచిది.

మధుమేహం ఉన్నవారికి..:
మామిడి పండులో సహజ చక్కెరలు (ఫ్రక్టోజ్, గ్లూకోస్) అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా పెంచుతాయి.. అలాగే మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) సుమారు 51 నుంచి 56 ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు దీనిని తినడం వల్ల రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు మధుమేహం ప్రమాదం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

మధుమేహం ఉన్నవారు మామిడి పండు తినేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:
మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను తినాలనుకుంటే తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీటిని పరిమితంగా తీసుకోవడమే మేలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఒక పండులోని సగం ముక్క లేదా అర కప్పు పండును తినొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మమిడి పండును తినాలనుకునేవారు తప్పకుండా భోజనం తర్వాత తినడం కీలకమని నిపుణులు తెలుపుతున్నారు. లేదంటే రాత్రి పడుకునే ముందు తింటే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా మమిడి పండు తిన్న రెండు గంటల తర్వాత చక్కెర స్థాయి పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News