Vitamin D: విటమిన్‌ D లోపిస్తే కడుపు ఆరోగ్యం కుంటుపడుతుందా? నిపుణులు సూచనలు..

Vitamin D Deficiency: ఈ బిజీ లైఫ్‌స్టైట్‌లో ఎక్కువ శాతం మంది ఇండోర్‌లోనే పనులు ఎక్కువ చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరికి విటమిన్‌ డీ లేమితో బాధపడుతుంటారు. అయితే ఈ విటమిన్‌ లోపిస్తే నేరుగా కడుపు ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 12, 2025, 08:28 AM IST
Vitamin D: విటమిన్‌ D లోపిస్తే కడుపు ఆరోగ్యం కుంటుపడుతుందా? నిపుణులు సూచనలు..

Vitamin D Deficiency: మన శరీరంలో విటమిన్ డీ తగ్గితే ఎముక ఆరోగ్యం పై మాత్రమే కాదు పేగు ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎండ ఎక్కువగా ఉండే మన భారత దేశంలో కూడా విటమిన్ డీ లేమితో చాలామంది బాధపడుతున్నారు. దానికి ప్రధాన కారణాలు ఉన్నాయి.

Add Zee News as a Preferred Source

 విటమిన్ డీ లేమితో బాధపడుతున్న వారికి కడుపు సమస్యలు విపరీతంగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇది పేగు ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ప్రాణాంతక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి అంటే సన్‌షైన్‌ విటమిన్ అని కూడా పిలుస్తారు. మన దేశంలో విటమిన్ డీ లేమితో చాలా మంది బాధపడుతున్నారు. దీంతో వారికి ఆరోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. 82 శాతానికి మందికి పైగా విటమిన్ డే లేమితో బాధపడుతున్నారని తెలుస్తోంది.

అంతేకాదు కొన్ని నివేదికల ప్రకారం ఈ విటమిన్ డీ లేమితో బాధపడుతున్న వారు కడుపు సమస్యలతో కూడా బాధపడుతున్నట్లు వారి ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలహీనంగా మారినట్లు తెలుస్తోంది. ఈ విటమిన్ లోపిస్తే మైక్రో బయోటా పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉంది. దీంతో కడుపులో మంట ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.

READ ALSO: పద్మశ్రీ గ్రహీత.. వనజీవి రామయ్య కన్నుమూత..  

అయితే విటమిన్ డీ నేరుగా కడుపులో అజీర్తి, గ్యాస్‌ కారణం కాదు కానీ కడుపులో ఫ్లోరా అసమతులంతో ఈ సమస్యలు ఏర్పడతాయి. విటమిన్ డీ లేమితో బాధపడుతున్న వారు ఈ విటమిన్ సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ సప్లిమెంట్స్ కంటే కూడా ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుని కిరణాల గడపడం ఎంతో ముఖ్యం. ప్రధానంగా ఉదయం 11 గంటల నుంచి రెండు గంటలు  సూర్యుడి కిరణాలు తాకేలా జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాదు విటమిన్ డి పుష్కలంగా ఉండే గుడ్లు, సముద్రపు చేపలు వంటివి డైట్లో చేర్చుకోవాలి. ఈ కాలంలో ఎక్కువ శాతం మంది ఇంట్లోనే గడపడం లేకపోతే ఆఫీసుల్లోనే ఉండటం వల్ల విటమిన్ డీ లేమితో సమస్యతో బాధపడుతున్నారు. వీళ్లలో వ్యాయామం కూడా లోపించడంతో ఈ సమస్యలు వస్తున్నట్టు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

READ ALSO: నేటి రాశిఫలాలు.. ఈ రాశులు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మార్గం సుగమం..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

...Read More

Trending News