Voluminous Hair: ఈ నూనె జుట్టుకు తగిలితే చాలు.. ఒక్క వెంట్రుక వద్ద పది వెంట్రుకలు పెరుగుతాయి..

Voluminous Hair With Fenugreek: మెంతులలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాలకు పవర్ హౌస్. మన భారతీయ సంస్కృతిలో మెంతులది కీలక పాత్ర. ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి..

Written by - Renuka Godugu | Last Updated : Feb 5, 2025, 11:39 AM IST
Voluminous Hair: ఈ నూనె జుట్టుకు తగిలితే చాలు.. ఒక్క వెంట్రుక వద్ద పది వెంట్రుకలు పెరుగుతాయి..

Voluminous Hair With Fenugreek: మెంతులతో హెయిర్ ప్యాక్ తయారు చేసుకొని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుతూనే ఉంటుంది. అంతే కాదు దీంతో నూనె కూడా తయారు చేసుకోవచ్చు.. ఇందులో ఉన్న ప్రోటీన్స్, నికోటిసిన్ యాసిడ్ జుట్టును బలంగా మారుస్తుంది. కుదుళ్ల నుంచి ఆరోగ్యంగా పెరిగేలా ప్రేరేపిస్తుంది.. మీ చుట్టూ మందంగా తయారవుతుంది. అయితే మెంతులతో నూనె లేదా హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి? ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం ..

Add Zee News as a Preferred Source

మెంతులలో లేసితిన్ మన జుట్టుకు మంచి పోషణ అందించి, హైడ్రేటెడ్ గా ఉండేలా ప్రేరేపిస్తుంది. దీంతో జుట్టు మృదువుగా.. మెరుస్తూ కనిపిస్తుంది. అంతేకాదు మెంతుల్లో ఉండే పొటాషియం రక్తప్రసరణను మెరుగు చేస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉండటం వల్ల జుట్టులో ఉన్న చుండ్రు, దురదలకు చెక్‌ పెడుతుంది.

జుట్టు ఊడిపోవడం చుండ్రు, పొడిబారటం, జుట్టు సన్నగా మారిపోయే సమస్యలకు మెంతులు ఎఫెక్ట్ రెమిడీ. మెంతులతో పేస్ట్ తయారు చేసుకుని జుట్టుకు అప్లై చేసుకుని తలస్నానం చేయడం వల్ల వారంలో మంచి ఫలితాలు పొందుతారు.. 

 జుట్టు బాగా రాలితే రెండు టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం దాన్ని పేస్ట్ చేసి, కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి ఒక గంట తర్వాత తల స్నానం చేయాలి. సాధారణ షాంపుతో తల స్నానం చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. హెయిర్ ఫాలికల్స్ కూడా బలంగా మారుతాయి. 

 ఇక మెంతులతో నూనె కూడా తయారు చేసుకోవచ్చు. దీని వల్ల ఊడిపోయిన చోట జుట్టు మళ్లీ పెరుగుతుంది. ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో ఒక స్పూను మెంతిపొడి వేసుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసి అరగంట తర్వాత తల స్నానం చేయండి. దీనివల్ల జుట్టులో ఉన్న చుండ్రు తొలగిపోయి మంచి పోషణ అందుతుంది. జుట్టు బలంగా మారుతుంది..

 ఇక జుట్టుకు మెంతులతో హెయిర్ ప్యాక్ వేసుకోవాలంటే పెరుగుతో పాటు వేసుకోవచ్చు. ఇందులో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకొని జుట్టుకు అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య త్వరగా తగ్గిపోతుంది. 

ఇదీ చదవండి: భానుడి భగభగలు షురూ.. నేటి నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు..  

ఇక మీ జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే మెంతులను రెండు టేబుల్ స్పూన్ నీళ్లలో వేసి బాగా ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత వడకట్టుకొని దీన్ని షాంపూలో వేసి జుట్టు అంతటికీ వాష్ చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా మారి పెరుగుతూ ఉంటుంది. జుట్టు ఊడే సమస్య ఉండదు.

 ఇక మెంతులతో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ కలిపి ఒక ఇన్ఫ్యూజ్ నీటిని తయారు చేసుకోవచ్చు. మీరు కొబ్బరి నూనె మెంతులను వేసి నానబెట్టుకోవాలి వేడి చేసి దీన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా బలంగా మారుతుంది.

ఇదీ చదవండి: బడ్జెట్‌లో పెరగని పీఎం కిసాన్‌ నిధి.. 19వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News