Sleeping competition: రోజుకు 9 గంటలు నిద్రపోగలిగితే పది లక్షల నగదు బహుమతి మీ సొంతం

Sleeping competition: రోజుకు 8-9 గంటలు నెల రోజుల పాటు పని చేస్తేనే గానీ జీతం దక్కదు. రోజూ పొద్దెక్కేవరకూ నిద్రపోతున్నవారిని చూస్తే..నిద్ర తప్ప పనీ పాటా లేదా అని విమర్శిస్తుంటాం. ఆ నిద్రే ఇప్పుడు పని కల్పిస్తుంది. ఐ మీన్..డబ్బులు తెచ్చిపెడుతుంది. అదేంటో తెలుసుకోండి.

Last Updated : Feb 25, 2021, 01:10 PM IST
  • నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించే అద్భుత అవకాశం
  • వేక్‌ఫిట్ స్లీప్ ఇంటర్న్ 2021-22 బ్యాచ్ కోసం దరఖాస్తుల ఆహ్వానం
  • రోజుకు 9 గంటలు ప్రతిరోజూ హాయిగా నిద్రపోతే..పది లక్షల బహుమానం
Sleeping competition: రోజుకు 9 గంటలు నిద్రపోగలిగితే పది లక్షల నగదు బహుమతి మీ సొంతం

Sleeping competition: రోజుకు 8-9 గంటలు నెల రోజుల పాటు పని చేస్తేనే గానీ జీతం దక్కదు. రోజూ పొద్దెక్కేవరకూ నిద్రపోతున్నవారిని చూస్తే..నిద్ర తప్ప పనీ పాటా లేదా అని విమర్శిస్తుంటాం. ఆ నిద్రే ఇప్పుడు పని కల్పిస్తుంది. ఐ మీన్..డబ్బులు తెచ్చిపెడుతుంది. అదేంటో తెలుసుకోండి.

Wakefit internship గురించి తెలుసా. అదే అనుకున్నదే. నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించే పని. అంటే ఇక్కడ నిద్రపోవడమే పని. ఇది చూస్తే ఇంకెవరూ మిమ్మల్ని నిద్ర తప్ప మరో పనీ పాటా లేదా..పని చేసి డబ్బులు పోగేసుకోవచ్చు కదా అని ఎవరూ అనలేరు. ఇంట్లో పెద్దవాళ్లు బలవంతంగా మిమ్మల్ని లేపినప్పుడు నిద్రపోయేందుకు కూడా డబ్బులిస్తే బాగుండేది అనుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే నిజంగానే నిద్రపోతే డబ్బులిస్తారు అక్కడ. ఆఫీసులకెళ్లి కష్టపడి రోజుకు 8-9 గంటలు పనిచేస్తూ నెల రోజులు నిరీక్షిస్తే వచ్చే జీతం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. 

వేక్‌ఫిట్ బ్యాచ్ 2021-22 స్లీప్ ఇంటర్న్‌షిప్ ( Wakefit batch 2021-22 sleep internship ) మీ కోసమే. చేయాల్సిందిల్లా రోజుకు 9 గంటలు నిద్రపోవాలి. వంద రోజులు ( Sleep daily 9 hours for 100 days ) అలా చేయగలిగితే అక్షరాలా పది లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించాలనుకునేవారికి అద్భుత అవకాశం. ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనేవారు ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా రోజుకు 9 గంటల సేపు నిద్రపోవాలి. ఈ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో బాగా నిద్రపోయేవారిలో కొందరిని ఎంపిక చేసి 100 రోజుల ఇంటర్న్‌‌షిప్‌కు అర్హత కల్పిస్తారు. ఇందులో ఎంపికైన వారందరికీ లక్ష రూపాయల చొప్పున లభిస్తాయి. గెలిచినవారికి మాత్రం ఏకంగా పది లక్షల రూపాయలు( 10 lakh rupees prize money)వస్తాయి. మీరు కూడా ఇంటర్న్‌షిప్‌లో భాగం కావాలనుకుంటే https://wakefit.co/sleepintern వెబ్‌సైట్‌ను సందర్శించి డీటైల్స్ ఫిల్ చేయండి.  కాంపిటిషన్‌లో పాల్గొనేవారు  టర్మ్స్ అండ్ కండిషన్స్ స్పష్టంగా ఒకటికి రెండుసార్లు చదువుకోండి.

Also read: Shweta tiwari: నలభైలో ఇరవైగా..బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ శ్వేతా తివారీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News