
Okra Water Benefits: బెండకాయను ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. వాటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తరచూ బెండకాయను తింటూనే ఉండడం ద్వారా మెదడు పనితీరు మెరుగవడంతోపాటు బరువు తగ్గడం కూడా సాధ్యమవుతుంది. అయితే సాధారణంగా బెండకాయను ఫ్రై, కూర బె, పులుసుగా తీసుకుంటుంటారు. కానీ బెండకాయలతో నీళ్లను తయారు చేసి తాగుతారని తెలుసా? ఆ నీటిని తాగడం ద్వారా బరువు తగ్గవచ్చనే విషయం తెలుసా? బరువు తగ్గాలనుకునే వారు బెండకాయ నీటిని తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాహార నిపుణులు ఈ విషయాన్నే చెబుతున్నారు. బెండకాయలలో ఫైబర్‌తోపాటు మెండుగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. బెండకాయలోని ఈ పోషకాలు బరువు తగ్గేందుకు సహాయపడతాయి.
బెండకాయలు చక్కెర స్థాయిని తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. డయాబెటిస్ (షుగర్)ను నియంత్రణలో ఉంచుతాయి. బెండకాయలను తింటే శరీరంలోని మెటబాలిజం పెరుగుతుంది. వంద గ్రాముల బెండకాయలను తింటే దాదాపుగా 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా బెండకాయలను తినాలి. బెండకాయల్లో సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలగజేస్తుంది. దీనివలన ఆకలి త్వరగా అనిపించదు. దీంతో ఆహారం మితంగా తీసుకుంటారు. ఇది బరువు తగ్గుదలకు దోహదం చేస్తుంది.
బెండకాయల నీళ్లను తాగడం వల్ల బరువు తగ్గుదలకు దోహదం చేస్తుంది. బెండకాయ నీటిలో ఉండే జిగురు వంటి పదార్థం కడుపు నిండుగా అనిపిస్తుంది. దీంతో ఆకలి వేయదు. ఇతర ఆహార పదార్థాలను తినాలనిపించదు. దీని వల్ల బరువు తగ్గడం అనేది చాలా తేలికవుతుంది. బెండకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. మెటబాలిజం మెరుగుపడితే శరీరంలో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కొవ్వొత్తిలా కరుగుతుంది. దీనివలన బరువు అమితంగా తగ్గుతారు. బెండకాయలను తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు నివారణ అవుతాయి. బెండకాయల నీళ్లను తయారు చేసుకోవడం ఇలా..
తయారు విధానం ఇలా..
కావాల్సిన పదార్థాలు
బెండకాయలు: 4 లేదా 5
నీళ్లు: ఒక గ్లాస్
నిమ్మరసం: ఓ టీ స్పూన్
తేనె: ఓ టీ స్పూన్
4 లేదా 5 బెండకాయలను తీసుకుని బాగా కడగాలి. బాగా కడిగి చివర్లను కట్ చేయాలి. అనంతరం బెండకాయలను పొడవుగా మధ్యలోకి చీల్చాలి. అలా చీరిన బెండకాయ ముక్కలను గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. తర్వాతి రోజు ఉదయం నీటిలోని బెండకాయ ముక్కలను తీసేయాలి. ఆ నీటిలో నిమ్మరసం, తేనె కలపాలి. ఈ నీటిని ఉదయం టిఫిన్ చేయడానికి 30 నిమిషాల ముందు లేదా రాత్రి భోజనం చేసేందుకు 30 నిమిషాల ముందు తాగాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి