Health Benefits Of Coffee Seeds: కాఫీ గింజలతో రుచికరమైన కాఫీ తయారు చేసుకోవడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడ పొందవచ్చు. వాటిలో ఉండే ప్రత్యేకమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మన శరీరాన్ని వివిధ రకాలుగా కాపాడతాయి.
కాఫీ గింజలు ఆరోగ్యలాభాలు:
కాఫీ గింజల్లో కెఫిన్ ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థను మెరుగుపరిచి అలసటను తగ్గించి, శక్తిని పెంచుతుంది. ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీ తాగడం వల్ల రోజంతా ఉత్సహంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. అలాగే మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్:
కాఫీ గింజలు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తుంది. వీటిలో క్లోరోజెనిక్ ఆమ్లాలు, ఫెరులిక్ ఆమ్లాలు, మెలనోయిడిన్స్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఒత్తిడిని తగ్గించి, గుండె జబ్బులు నుంచి రక్షణ కల్పిస్తాయి.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
కాఫీ తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కెఫిన్ జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని పెంచడంలో సహాయపడుతుంది. కాఫీలోని యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.
గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది:
కాఫీ మితంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవారిలో గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని చెబుతున్నాయి. అయితే అధిక మోతాదులో కాఫీ తాగడం వల్ల గుండె వేగం పెరగవచ్చు కాబట్టి మితంగా తీసుకోవడం ముఖ్యం.
టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
కాఫీ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు కాఫీని మితంగా తీసుకోవాలి చాలా మంచిది.
కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
కాఫీ కాలేయ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగేవారిలో కాలేయ క్యాన్సర్, సిర్రోసిస్ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కాఫీ కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా తగ్గించడంలో సహాయపడుతుంది.
కాఫీని ఎలా తీసుకోవాలి:
కాఫీ ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి దానిని సరైన మార్గంలో తీసుకోవడం ముఖ్యం. అధిక మొత్తంలో చక్కెర, క్రీమ్ లేదా ఇతర కృత్రిమ పదార్ధాలు కలపకుండా బ్లాక్ కాఫీ తాగడం ఉత్తమం. మీరు పాలు లేదా సహజమైన స్వీటెనర్లను కొద్ది మొత్తంలో ఉపయోగించవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగడం సాధారణంగా ఆరోగ్యకరమైనది.
Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook









