Pistachio Benefits: ప్రతిరోజు పిస్తా పప్పులు ఇలా తింటే డాక్టర్ తో పనే ఉండదు!!

Health Benefits Of Pistachio: డ్రైఫూట్స్‌లో ఒకటి పిస్తా పప్పు. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. పిస్తా పప్పు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి? ప్రతిరోజు తినడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చు అనే వివరాలు తెలుసుకుందాం.  

Written by - Shashi Maheshwarapu | Last Updated : Apr 19, 2025, 12:38 PM IST
Pistachio Benefits: ప్రతిరోజు  పిస్తా పప్పులు ఇలా తింటే డాక్టర్ తో పనే ఉండదు!!

Health Benefits Of Pistachio: ప్రతిరోజు డ్రైఫూట్స్‌ తింటే అనారోగ్యసమస్యల బారిన పడాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. డ్రైఫూట్స్‌ లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ముఖ్యం. అయితే డ్రైఫూట్స్‌లో పిస్తాపప్పు ఒకటి. దీని మనం స్వీట్‌ల్లో, సలాడ్స్‌, మిల్క్‌ షేక్‌ల్లో ఎక్కువగా ఉపయోగిస్తాము. పిస్తా పప్పులో పోషకాలు సమృద్ధిగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. 

Add Zee News as a Preferred Source

పిస్తా పప్పులు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1. పోషక విలువలు: పిస్తా పప్పుల్లో ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు,  విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందిచడంలో కీలక ప్రాత పోషిస్తుంది.

2. గుండెకు మేలు: ప్రతిరోజు గుప్పెడు పిస్తా పప్పు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిచడంలో సహాయపడుతాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడం వల్ల  గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

3. బరువు తగ్గడంలో:  అధిక బరువు సమస్యతో బాధపడేవారికి పిస్తా పప్పు ఒక మంచి ఎంపిక. ఇందులో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌ కడుపు నిండిన భావన ఉంటుంది. దీని వల్ల అతిగా తినాలి అనే కోరిక తగ్గుతుంది. కాబట్టి పిస్తాతో తయారు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.

4. షుగర్‌ లెవల్స్‌ అదుపులో: షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేయడంలో పిస్తా పప్పుఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరమైన ఆహారం.

5. కంటి చూపు: పిస్తా పప్పుల్లో లుటీన్ ,  జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయస్సులో వచ్చే కంటి సంబంధిత సమస్యలు, ముఖ్యంగా  కంటిశుక్లం రాకుండా చేస్తాయి. కాబట్టి పిస్తా పప్పు తీసుకోవడం చాలా మంచిది. 

6. జీర్ణవ్యవస్థ: మలబద్ధకం, గ్యాస్ ఇతర జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా పిస్తా తీసుకోవడం  మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్‌ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను పెంచడం వల్ల జీర్రక్రీయ మెరుగా పని చేస్తుంది. మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది.

7. యాంటీఆక్సిడెంట్లు: పిస్తా పప్పుల్లో టోకోఫెరోల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి సహాయపడుతాయి. దీని వల్ల  క్యాన్సర్ , ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. 

8. మెదడు పనితీరులో: పిస్తా పప్పుల్లో విటమిన్ B6 పుష్కలంగా లభిస్తుంది.అంతేకాకుండా ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో,  నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. 

9. రోగనిరోధక శక్తి: పిస్తా పప్పుల్లో ఉండే విటమిన్‌ సి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుచుతుంది. దీంతో పాటు విటమిన్ B6 రోగనిరోధక కణాల ఉత్పత్తికి, పనితీరులో సహాయపడుతాయి. 

10. ఆరోగ్యమైన చర్మం: పిస్తా పప్పుల్లో ఉండే విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. ఇవి మొటిమలు, మచ్చలు, చర్మం సమస్యలు రాకుండా చేస్తాయి. పిస్తా వల్ల చర్మం ఎల్లప్పుడు యవ్వనంగా ఉంటుంది.

11. ఎముకలు దృఢంగా: పిస్తా పప్పుల్లో ఫాస్పరస్ , మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి కీళ్ళ నొప్పి సమస్యల రాకుండా చేస్తాయి. 

12. రక్తహీనత సమస్య: పిస్తా పప్పుల్లో ఐరన్ కూడా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. మహిళలు ప్రతిరోజు తినడం చాలా మంచిది. 

కాబట్టి పిస్తా పప్పులను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఏదైనా మితంగా తీసుకోవడం ముఖ్యం. రోజు గుప్పెడు పిస్తా పప్పులు తింటే మంచిది. 

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

Trending News