)
Badam Milk Vs Packet Milk Benefits: ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒప్పుడు ఆవు పాలు, గేదె పాలు ఉపయోగించేవారు కానీ ఇప్పుడు చాలా మంది బాదం పాలు, సోయా పాలు, ఓట్ పాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో బాదం పాలు చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సినీతారు సైతం బాదం పాలు ఉపయోగిస్తున్నారు. అయితే సాధారణ పాలతో పోలిస్తే బాదం పాలకు ఉండే తేడాలేమిటి? ఆరోగ్య పరంగా ఏది ఎక్కువ ప్రయోజనకరమైనది?అనే వివరాలు తెలుసుకుందాం.
సాధారణ పాలలో అనేక పోషకాలను కలిగి ఉంటాయి. అందులో ముఖ్యంగా కాల్షియం, విటమిన్ డి, విటమిన్ బి12, రిబోఫ్లావిన్, పొటాషియం, ప్రోటీన్, అధికంగా లభిస్తాయి. అయితే బాదం పాలు అనేది బాదం గింజల నుంచి తయారు అవుతాయి. బాదంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఇ, డి, ప్రోటీన్, కొవ్వులు ఉంటాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం సాధారణ పాలు ఎదిగే పిల్లలకు, టీనేజర్లు ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్ ఉండటం వల్ల వారికి ఎముకలు దృఢంగా తయారు అవుతాయి.
బాదం పాలు ఎవరికి మంచిది?
బాదం పాలు లాక్టోస్ లేని పాలు కాబట్టి ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. సాధారణ పాలతో పోలిస్తే బాదం పాలలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపిక. గుండె ఆరోగ్యంగా ఉంచడంలో కూడా బాదం పాలలో సహాయపడుతాయి. బాదం పాలు వీగన్ డైట్‌కు అనుకూలమైనది. బాదం పాలు కాల్షియం, విటమిన్ D తో బలపరచబడి ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనవి. విటమిన్ E ఉండటం వల్ల చర్మాన్ని తేమగా ఉంచడానికి ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడుతుంది.
అయితే, శిశువులకు, చిన్న పిల్లలకు ఆవు పాలకు పూర్తి ప్రత్యామ్నాయంగా బాదం పాలను ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఇతర ముఖ్యమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. అలాగే బాదం గింజల అలెర్జీ ఉన్నవారు బాదం పాలకు దూరంగా ఉండాలి.
ముగింపు
సాధారణ పాలు, బాదం పాలు రెండు పోషక విలువలను కలిగి ఉంటాయి. ఎదిగే పిల్లలకు,ఎక్కువ ప్రోటీన్ అవసరమైన వారికి సాధారణ పాలు మంచి ఎంపిక కావచ్చు.
సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలమని గుర్తుంచుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook