Makhana: సాయంత్రం స్నాక్‌లో మఖానా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Makhana Health Benefits: ఈవెనింగ్ స్నాక్ లో మఖాన తింటే ఎన్ని ప్రయోజనాలు తెలుసా?  మఖానా ఇది ఆరోగ్యకరమైన గింజ. దీన్ని తామర గింజలని కూడా పిలుస్తారు. ఇది ఎంతో ఆరోగ్యకరమైన స్నాక్ అని కూడా చెప్పవచ్చు. క్రంచీగా ఉండే ఈ స్నాక్ ఈవెనింగ్ సమయంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

Written by - Renuka Godugu | Last Updated : Apr 5, 2025, 03:47 PM IST
Makhana: సాయంత్రం స్నాక్‌లో మఖానా తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Makhana Health Benefits: సాయంత్రం వేళ స్నాక్ తినాల్సిన సమయంలో అనారోగ్యకరమైన ఆహారాలకు బదులు మఖాన వంటి ఆరోగ్యకరమైన ఫుడ్ మీ డైట్‌లో చేర్చుకోవాలి. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

ఈవెనింగ్ స్నాక్‌లో మఖానా తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ నుంచి మన శరీరాన్ని కాపాడతాయి. అంతేకాదు సెల్ డామేజ్ కాకుండా ఫ్రీ ర్యాడికల్స్‌ను కూడా నివారిస్తాయి.తద్వారా ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. ప్రతిరోజు ఒక కప్పు మఖాన తీసుకోవాలి.

వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవాళ్లు మఖానా సాయంత్రం తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. అంతేకాదు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది. తద్వారా ఇతర ఆహారాలు తినకుండా ఉంటారు.

మఖానాలో ఉండే మెగ్నీషియం రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్త సరఫరాని కూడా మెరుగు చేస్తుంది. దీంతో మీ గుండె పనితీరు కూడా మెరుగవుతుంది. ఇందులో ఫైబర్, ప్రోటీన్ కూడా ఉంటుంది. మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తుంది.

రెగ్యులర్‌గా మఖానా తినడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. సీజనల్ జబ్బులు రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. ప్రధానంగా తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.

 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు మఖానా తినాలి. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్‌ సూచీ (GI)తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. అంతేకాదు మంచి జీర్ణ ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. 

ఇదీ చదవండి:  Bay Leaves: బిర్యానీ ఆకుని ఇలా వాడితే నమ్మలేని 10 ప్రయోజనాలు తెలుసా?

కిడ్నీ ఆరోగ్యానికి మఖానా తినండి. ఇందులో డైరుటిక్‌ గుణాలు ఉంటాయి. మన శరీరంలోని విష పదార్థాలను బయటికి వెళ్తాయి. మన కిడ్నీ పనితీరు కూడా మెరుగవుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యను కూడా తగ్గించేస్తుంది .

మఖానా ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా. ఇందులో విటమిన్స్, మినరల్స్, విటమిన్ ఇ ఉంటుంది. ఇది చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. మన రెగ్యులర్ డైట్ లో మఖానా చేర్చుకోవడం వల్ల చర్మానికి సాగే గుణం అందిస్తుంది. తద్వారా ముఖంపై ఉన్న మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. అదనంగా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌  స్కిన్ డామేజ్ కాకుండా యూవీ కిరణాల నుంచి రక్షిస్తుంది.

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News