Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Bamboo Salt Benefits: ఉప్పు అంటే మనకు సాధారణంగా వంటల కోసం వాడే ఉప్పు గురించి మాత్రమే తెలుసు కదా. ఇక మనం కుకింగ్ లో వాడే ఉప్పు ధర ఎంత ఉంటుంది. మహా అయితే కిలో రూ. 20 నుంచి రూ. 30 ఉంటుంది. అయితే కొరియాలో తయారయ్యే బాంబు సాల్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఇక దీని ధర ఎంతో తెలిస్తే పక్కా షాకవడం ఖాయం.    

Written by - Aruna Maharaju | Last Updated : Dec 5, 2025, 04:52 PM IST
Bamboo Salt: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొరియన్ బాంబు సాల్ట్.. కిలో రూ.35 వేలు.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

Health Benefits Of Korean Bamboo Salt: ఉప్పు అంటే మనకు సాధారణంగా వంటల కోసం వాడే ఉప్పు గురించి మాత్రమే తెలుసు కదా. ఇక మనం కుకింగ్ లో వాడే ఉప్పు ధర ఎంత ఉంటుంది. మహా అయితే కిలో రూ. 20 నుంచి రూ. 30 ఉంటుంది. అయితే కొరియాలో తయారయ్యే బాంబు సాల్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా..? దీని ధర ఎంతో తెలిస్తే పక్కా షాకవుతారు. ఈ ఉప్పు కిలో అక్షరాలా రూ.35 వేలు. ఇది ఒక అద్భుతమైన, అత్యంత కాస్ట్లీ ఉప్పు. ఈ ఉప్పును ప్రపంచంలోనే అత్యంత విలువైనదిగా చెప్తారు. మరి అంతలా ఈ ఉప్పులో ఉండే ఆ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Add Zee News as a Preferred Source

తొమ్మిదిసార్లు కాల్చే ప్రక్రియ..
ఈ ఉప్పును ప్రత్యేకమైన బాంబు గొట్టాల్లో నింపి పై నుండి పసుపు మట్టితో మూసి అధిక ఉష్ణోగ్రతలో అంటే దాదాపు 1000°C నుంచి 1500°C వేడిలో కాల్చుతారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 సార్లు కాలుస్తారు. అందుకే దీనికి 9x రోస్టెడ్ సాల్ట్ అనే పేరు వచ్చింది. ఇలా చేయడం వల్ల ఉప్పులోని హానికరమైన లోహాలు తొలగిపోయి.. శుద్ధి స్థాయిలో ఉప్పు తయారవుతుంది.

ఈ ఉప్పులో ఔషధ గుణాలు అధికం..
బాంబు సాల్ట్‌ను కొరియన్ ప్రాచీన వైద్యంలో డిటాక్స్, జీర్ణ సమస్యలు, పేగుల శుభ్రతకు ఉపయోగిస్తారు. అలాగే ఇది మొటిమలు, మౌఖిక ఆరోగ్య సమస్యలు వంటి సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. ఇందులో ఉన్న లౌరిక్ యాసిడ్, మినరల్స్ శరీరానికి సహజ రోగ నిరోధక శక్తిని అందిస్థాయి.

మినరల్ కంటెంట్ అధికం..
ఈ ఉప్పును 9 సార్లు కాల్చడం వల్ల లోపల నుంచి తేలికగా శరీరానికి అందేలా మారుతుంది. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ ఉప్పును మితంగా తీసుకుంటే శరీరంలోని మినరల్ లోపాలను తగ్గించుకోవచ్చు.

ఎసిడిటీ, pH బాలన్స్..
బాంబు ఉప్పు అనేది ప్రత్యేకమైన అల్కలైన్ ఉప్పుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది శరీరంలోని ఆమ్లతను తగ్గించి, pH స్థాయిని సమతుల్యంలో ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

అత్యంత అరుదైన ఉప్పుగా ప్రసిద్ధి..
ఈ ఉప్పు చాలా అరుదుగా తయారు చేయబడుతుంది. కొరియాలో కొన్ని సంప్రదాయ కుటుంబాలు మాత్రమే ఈ ఉప్పును తయారు చేస్తాయి. అధిక ఖర్చు, శ్రమ, సమయం, నైపుణ్యం అవసరం అవడంతో ఎక్కువగా విలువగల ఉప్పుగా ఇది పరిగణించబడింది.

ఈ ఉప్పును వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
* ఇది సాధారణ వంట ఉప్పుగా వాడకూడదు.
* నిపుణుల సలహాతో మాత్రమే ఉపయోగించాలి.
* ఖచ్చితమైన సోర్స్ నుంచి మాత్రమే కొనాలి.

ఈ ఉప్పును ఎలా వాడతారంటే..
1. తలనొప్పి, జీర్ణ సమస్యలు, పేగుల డిటాక్స్ కోసం నీటిలో కలిపి తాగుతారు.
2. టూత్‌పౌడర్, ఔషధ క్రీములు, సబ్బులు, ఆరోగ్య సప్లిమెంట్స్‌లో ఉండే అవకాశం ఉంది.

Also Read: Banana: అరటి పండు తిన్నవెంటనే ఈ పనులు మాత్రం అస్సలు చేయకండి.. చేస్తే ఏమవుతుందంటే..!

Also Read: Ration Rice Idli: రవ్వ అవసరం లేకుండానే రేషన్ బియ్యంతో తెల్లని పువ్వులాంటి ఇడ్లీలు.. ఎలా చేసుకోవాలంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

About the Author

Aruna Maharaju

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. లైఫ్‌స్టైల్‌, హెల్త్‌,  స్పోర్ట్స్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో ఆరేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News