)
Black Cobra Rescue Video Watch Now: నల్ల నాగుపాములు ఎంత శక్తివంతమైన మనందరికీ తెలుసు. అవి అత్యంత విషపూరితమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ పాములు ఎక్కువగా కొన్ని ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వర్షాకాలంలో అక్కడక్కడ చాలా అరుదుగా సంచారం చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ ఊర్లో సంచారం చేసిన నల్ల నాకు పాముని పట్టుకొని రెస్క్యూ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ వీడియో చూసి చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగానే ఈ పాము సంచారం చేయడం చూసి గ్రామస్తులు వెంటనే ఆ పాముపై ఒక సంచిని కప్పి దానిపై బకెట్‌ను బోర్లించి ఉంచారు. దీంతో ఆ పాము అలాగే కదలకుండా ఉండిపోయింది. ఆ తర్వాత వారు వెంటనే అటవీశాఖ సిబ్బందితోపాటు స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. వారు వెంటనే అక్కడికి చేరుకొని ఆ పామును రెస్క్యూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ముందుగా ఒక స్నేక్ క్యాచర్ ఆ పాము ఉన్న బకెట్‌ను తీసి నెమ్మదిగా పాముపై ఉన్న సంచిని తీయడం మీరు గమనించవచ్చు.
ఆ తర్వాత అతడు పాము తోక భాగాన్ని పట్టుకొని.. వెంటనే వేరే సంచిలోకి బంధించే ప్రయత్నం చేశాడు. అయితే ఇంతలోనే ఆ పాము అందులోకి వెళ్ళకుండా అతడి పై దాడి చేసే ప్రయత్నం చేసింది. ఆ స్నేక్ క్యాచర్ తోక పట్టుకొని ఉండడంతో పాము ఆగ్రహానికి గురై.. మరోసారి అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఇలా మూడుసార్లు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. చివరిసారిగా అతడి చేతు దగ్గరికి వచ్చి కాటేయ్య పోయింది. వెంటనే అతడు అలర్ట్ అయ్యి ఆ పాము దాడి చేయకుండా చేతును ఒక్కసారిగా మార్చేశాడు. ఈ దృశ్యాలు వీడియోలో మీరు క్లియర్ గా చూడవచ్చు..
చివరగా ఆ స్నేక్ క్యాచర్ నెమ్మదిగా వేరే సంచిలో వేసి ఆటవిశాఖ సిబ్బందికి అప్పగించాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది స్మార్ట్ ఫోన్స్‌లో చిత్రీకరించి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు.. ఇప్పుడు ఈ వీడియో వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతూ వస్తోంది. దీనిని చూసినవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంత ప్రమాదకరమైన పామును ప్రాణాలకు తెగించి ఆ స్నేక్ క్యాచర్ పట్టుకోవడం చూసి అతడిని ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ప్రముఖ స్నేక్ క్యాచర్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను చాలామంది వీక్షించినట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి