1000 Wala Review: 1000 వాలా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!

1000 Wala Review: తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్ లో కొత్త నటీనటులు ఎక్కువ పరిచయమవుతున్నారు. అందులో కొంత మంది టాలెంట్ చూపెడుతూ దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రమే ‘1000 వాలా’. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా.. లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 14, 2025, 09:43 PM IST
1000 Wala Review: 1000 వాలా మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!

యువ హీరో అమిత్ హీరోగా నటించిన చిత్రం '1000 వాలా'. సీనియర్ హీరో సుమన్ ముఖ్యపాత్రలో పిల్లా ప్రసాద్ మరో లీడ్ రోల్లో  ముఖ్తార్ ఖాన్ నటించారు. సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో భారీ  హంగులతో విడుదలైన ఈ సినిమా మార్చి 14న విడుదలైంది.

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే..

అర్జున్ (అమిత్) చిన్నపుడే పేరేంట్స్ చనిపోవడంతో తాత వద్ద పెరుగుతాడు. అయితే అతనికి చిన్నప్పటి నుంచే నటుడు కావాలనేది డ్రీమ్. కొన్ని కారణాల వల్ల అతను యాక్టర్ కాలేకపోతాడు. ఆ తరవాత తన స్నేహితుడు తండ్రి (పిల్ల ప్రసాద్) కు సినిమా వాళ్లతో మంచి సంబంధమే ఉంటుంది. ఈ క్రమంలో తనకు తెలిసిన సినిమా ఫ్రెండ్ అమిత్ కు సినిమా ఛాన్స్ ఇప్పిస్తాడు. అయితే.. సినిమా ఛాన్స్ ఇస్తానన్న వ్యక్తి అమిత్ ను చూసి షాక్ గురవుతాడు. అతన్ని తీసుకొని భవానీ ప్రసాద్ (ముఖ్తార్ ఖాన్) కలుస్తాడు. ఆ తర్వాత అతని ఫ్రెండ్ అయిన (సుమన్)అర్జున్ తో సినిమా నిర్మిస్తానని చెబుతాడు. అయితే సినిమా షూటింగ్ సమయంలో అమిత్.. ఆ సినిమా హీరోయిన్ శైలుతో ప్రేమలో పడతాడు. అయితే హీరోయిన్ కు తన ప్రేమ విషయాన్ని చెబుతున్న సమయంలో తనలాగే ఉన్న అమిత్ ను ఎవరో చంపేస్తారు. అతని ప్లేస్ మిగతా సినిమాను ఇతనితో షూట్ చేస్తారు. ఇంతకీ హీరో అమిత్ ను ఎవరు చంపారు. అతనికి ఇతనికీ ఏమైనా సంబంధం ఉందా.. ? చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.
 

కథనం, విశ్లేషణ..

కమర్షియల్ కథలకు ఫ్యామిలీ సెంటిమెంట్ కలిపితే మంచి వంటకం అవుతోంది. తాజాగా దర్శకుడు ‘1000 వాలా’  సినిమా కథను బాగానే రాసుకున్నా.. దాన్ని అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కిస్తే.. ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఈ సినిమాను ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని పేలవమైన కథనం, దర్శకత్వం తో ఈ సినిమాకు మైనస్ గా మారాయి. మంచి కథ ను రాసుకుంటే సరిపోదు. దాన్ని తెరపై ఎలా చూపించదనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. దర్శకుడు ఈ సినిమా అనే వంటకం బాగానే వండిన అసలైన ఉప్పు వేయడం మరిచిపోయాడు. అన్న ప్రాసన రోజే ఆవకాయ అన్నం తిన్నట్టు కొత్త హీరోతో ఓ కమర్షియల్ హీరో చేయాల్సిన అన్ని పనులు చేయించేయాలనే ప్రయత్నమే బెడిసి కొట్టిందనే చెప్పాలి. సినిమాకు ఫోటోగ్రఫీ బాగుంది. సంభాషణాలు ఇంకాస్త పదును పెట్టాల్సి ఉంది. సినిమాటోగ్రఫీ,ఆర్ఆర్ బాగున్నాయి. సినిమాలో విలేజ్ సీన్స్ బాగున్నాయి.

నటీనటుల విషయానికొస్తే.. అమిత్ డ్రీమ్ స్టార్ గా.. అట్టు అర్జున్ గా అమిత్  రెండు డిఫరెంట్ పాత్రల్లో మెప్పించాడు. ఈ మధ్య వెండితెరకు పరిచయం కావాల్సిన వాళ్లు డాన్సలు, ఫైట్స్  గట్రా.. అన్నింట్లో ట్రెయిన్ వస్తున్నారు. ఈ విషయంలో కొత్తగా పరిచయం అవతున్న హీరోల్లో ఈ విషయాన్ని  గొప్పగా చెప్పుకోవాల్సిన పనిలేదు. షారుక్ బైక్ రూపంలో తెలుగు తెరకు మంచి ప్రతి నాయకుడు (విలన్) దొరికాడు. సుమన్, పిల్లా ప్రసాద్ వంటి వారు  తమ పరిధి మేరకు రాణించారు. మిగిలిన నటీనటులు ఓకే అనిపించారు.

పంచ్ లైన్.. సౌండ్ లేని ‘1000 వాలా’ ..

రేటింగ్: 2.25/5

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News