మూవీ రివ్యూ: ఏఎల్ సీసీ (ALCC)
సినిమాటోగ్రఫీ: యెస్ చరణ్ తేజ
సంగీతం: జస్వంత్ పి
ఎడిటింగ్: నిఖిల్ & రాజేష్
కథ, మాటలు, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం: లేలీధర్ రావు కోలా
రిలీజ్ డేట్ : 25-4-2025
ఎల్ ఆర్ ఫిలిం సర్క్యూట్స్ బ్యానర్ పై లేలీధర్ రావు స్వీయ దర్శకత్వంలో ఆయన రచనలో తెరకెక్కిన చిత్రం ‘ఏఎల్ సీ సీ’ (ఓ యూనివర్స్ బ్యాచిలర్). నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేపీ నవీన్, శ్రావణి శెట్టి జంటగా నటించగా శ్రీకర్ కోమండూరి, నేత్ర, ధనుష్ దేవర పోలి, శామ్ నాయక్, డి శ్రీనివాసులు రెడ్డి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు. ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే:
ఒక సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఓ యంగ్ స్టర్ తనకు ఇష్టమైన సినిమాలను వదిలేసి తన కుటుంబం కోసం ఎంతో కష్టపడి చదువుకోవడం కోసం భాగ్యనగరానికి వస్తాడు. తన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఒక అమ్మాయి ని చూసి ప్రేమలో పడిపోతాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వచ్చిన తర్వాత అతని లైఫ్ లో ఎలాంటి ఛేంజస్ మొదలయ్యాయి. ఆ అమ్మాయి రావడం వల్ల ఆ యువకుడు తాను అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యాడా ..? లేదా? తన ప్రయాణంలో అతని మిత్రులు ఎంతవరకు తనకు తోడుగా నిలబడ్డారు..? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి ధరపై ఈ చిత్రం చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే...
ఈ చిత్రానికి రచయితతో పాటు డైరెక్టర్ నిర్మాత అయినటువంటి లేలీధర్ రావు తాను అనుకున్న కథను తెరపై ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యాడు. తాను చెప్పాలనుకున్న పాయింట్ ను సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. ఈ చిత్రానికి అన్ని తానై వ్యవహరించాడు. ఈ సినిమాను బాగానే తెరకెక్కించినా.. దానికి తగ్గ డైలాగులు విషయంలో తడబడ్డట్టు కనిపించింది. అదే సమయంలో తాను చెప్పాలనుకున్న భావాన్ని సూటిగా చెప్పాడు. అంతేకాదు చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా లావిష్ గా తెరకెక్కించాడు.సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తాన్ని గ్రాఫిక్స్ తో కాకుండా న్యాచురల్ లొకేషన్స్ లో తీయడం బాగుంది. ఈ సినిమాకు ఆర్ ఆర్ ప్రాణంలా నిలిచింది. పాటలలో ముఖ్యంగా బ్యాచిలర్ టైం అనే సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇతర సాంకేతిక విషయాలలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీ రూపుదిద్దుకోవడం జరిగింది. సినిమా స్లో నేరేషన్ తో పాటు కొత్త వాళ్లు కావడం కాస్త ఇబ్బంది కలిగించే విషయం.
నటీనటుల నటన:
ఈ సినిమాలో హీరోగా నటించిన నవీన్ (విగ్నేష్) కొత్త అయిన మంచి నటన కనబరిచాడు. ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడిగా పర్ఫామెన్స్ బాగుంది. అలాగే చిత్రంలో స్క్రీన్ ప్లే తక్కువైనప్పటికీ హీరోయిన్ గా నటించిన శ్రావణి శెట్టి (మనూజ) మంచి ఈజ్ తో నటించింది. ఇతర నటీనటుల తమ పరిధి మేరకు రాణించారు.
పంచ్ లైన్.. సోషల్ మెసేజ్ తో కూడిన ‘ఓ యూనివర్సల్ బ్యాచిలర్’..
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన
కథ
బిజిఎం
మైనస్ పాయింట్స్:
నటీనటులు కొత్తవారు కావడం
డైలాగ్స్,
స్లో నేరేషన్
రేటింగ్ :2.5/5
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









