)
SKN: ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిలను పరిచయం చేస్తూ వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు ఎస్ కే ఎన్. ఆయన ఇప్పటిదాకా దాదాపు 10 మంది తెలుగు అమ్మాయిలకు కథానాయికలుగా ఛాన్సులు ఇవ్వడం విశేషం. హీరోయిన్స్ గానే కాదు చిత్ర పరిశ్రమలోని అన్ని క్రాఫ్టుల్లో 25 మంది తెలుగు అమ్మాయిలను పరిచయం చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నారు. తాజాగా తన కొత్త సినిమా చెన్నై లవ్ స్టోరీ ద్వారా తెలుగు అమ్మాయి శ్రీగౌరి ప్రియకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ టీజర్ రీసెంట్ గా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తానని చెప్పడమే కాకుండా.. తను మాటిచ్చినట్లే వరుస ఛాన్సులు ఇస్తున్నారు నిర్మాత ఎస్కేఎన్. ఈ రోజుల్లో చిత్రంతో రశ్మి, ఆనంది, రొమాన్స్ సినిమాతో మానస, టాక్సీవాలాతో ప్రియాంక జవాల్కర్ , సంతోష్ శోభన్ కొత్త చిత్రంతో హారిక, మరో కొత్త చిత్రంతో ఐశ్వర్య, త్రీ రోజెస్ వెబ్ సిరీస్ తో కుషిత కల్లపును కథానాయికలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేశారు ఎస్ కేఎన్.
ఇక బేబిలో అప్పటికే సినిమాల్లో పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్యను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు శ్రీ గౌరి ప్రియను చెన్నై లవ్ స్టోరీ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఎస్ కేఎన్. భవిష్యత్తులో తాను నిర్మించే చిత్రాల్లో కథానాయికలుగా ఫస్ట్ ప్రాధాన్యత తెలుగు అమ్మాయిలకే ఇవ్వాలని భావిస్తున్నారీ యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook.