టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీస్ లో దొంగతనం బ్యాక్ డ్రాప్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలొచ్చాయి. అంతేకాదు గజ దొంగ, భలే దొంగ, మంచి దొంగ, జేబు దొంగ ఇలా దొంగలను హీరోలుగా చూపెట్టి మన దర్శకులు ప్రేక్షకుల సొమ్మును కొల్లగొట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన చిత్రమే ‘చౌర్య పాఠం’. పేరుతోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పారు ఆడియన్స్. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
సినిమా పిచ్చి ఉన్న ఓ యువకుడు సినిమా తీయాలనే మోజులో ఉన్న డబ్బంత అయిపోతుంది. ఈ నేపథ్యంలో సినిమాను పూర్తి చేయడానికి దొంగతనం చేయడమే శరణ్యం అనుకుంటాడు. ఈ నేపథ్యంలో ఓ ఊర్లో ఉన్న బ్యాంకు కు కన్నం వేయాలనుకుంటాడు. ఈ క్రమంలో వారికీ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇక బ్యాంక్ ఉద్యోగి అయిన హీరోయిన్ .. హీరో గ్యాంగ్ లో ఎలా చేరింది. మరి హీరో బ్యాంక్ దొంగతనం చేసి సినిమాను పూర్తి చేసాడా.. ? లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
‘చౌర్య పాఠం’ అనే టైటిల్ తోనే ఈ సినిమా ఎలా ఉండబోతుందో దర్శకుడు చెప్పాడు. ఈ సినిమాను కూడా దర్శకుడు ఆద్యంతం ఆసక్తికరంగా మలిచాడు. ముఖ్యంగా హీరో సినిమా పిచ్చితో ఉన్న ఆస్తి మొత్తాన్ని సినిమా నిర్మాణంలో పెట్టేస్తాడు. ఆ తర్వాత సినిమాను పూర్తి చేయడానికి చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించక .. అతను బ్యాంక్ రాబరీ చేయాలనుకోవడం.. దీని కోసం ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసి వారికి దొంగతనం శిక్షణ ఇప్పించడం వంటివి దర్శకుడు క్రియేటివిటిని మెచ్చుకోవాలి. అందులో బ్యాంక్ ఎంప్లాయి అయిన హీరోయిన్ ను ఎందుకు గ్యాంగ్ చేర్చుకోవాల్సి వచ్చిందనే అంశాలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసాడు. సినిమా కాబట్టి అంతా నడిచిపోయింది. కానీ నిజ జీవితంలో ఇదంత ఈజీ టాస్క్ కాదనే చెప్పాలి.ఈ సినిమాలో అంతా కొత్తవాళ్లే కావడం.. కమర్షియల్ అంశాలకు దూరంగా తెరకెక్కించడం వంటివి ఈ చిత్రానికి ప్రతికూలం అని చెప్పాలి.
ఈ సినిమా తీసిన మెయిన్ కథలోకి తీసుకెళ్లడానికి ఎక్కువ సమయం తీసుకోవడం మైనస్ అని చెప్పాలి. ఇక కార్తీక్ ఘట్టమనేని అందించిన కెమెరా వర్క్ బాగుంది. దేవ్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది.
నటీనటుల విషయానికొస్తే..
హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ఇంద్ర రామ్ మంచి నటనతో మెప్పించాడు. ఫస్ట్ మూవీ అయిన.. నాచులర్ యాక్టింగ్ తో మెప్పించే ప్రయత్నం అయితే చేసాడనే చెప్పాలి. పాయల్ రాధాకృష్ణ బ్యాంక్ ఉద్యోగిని పాత్రలో పర్వాలేదనిపించింది. గ్రామ పెద్ద పాత్రలో రాజీవ్ కనకాల తన పాత్రకు న్యాయం చేసాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
రేటింగ్: 2.75/5
పంచ్ లైన్..కాస్తంత హాస్యంతో కూడిన ‘చౌర్య పాఠం’...
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









