Cherasala Review: ‘చెరసాల’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!

Cherasala Telugu movie review: రామ్ ప్రకాష్ గున్నం స్వీయ దర్శకత్వంలో  తెరకెక్కిన మూవీ ‘చెరసాల’.  ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్ మీద కద్రి అంజమ్మ సమర్పణలో ఈ సినిమా   తెరకెక్కింది. ఈ రోజు ఈ సినిమా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులను మెప్పించిందా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 11, 2025, 03:57 PM IST
Cherasala  Review: ‘చెరసాల’ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..!

రామ్ ప్రకాష్ గున్నం ప్రధాన పాత్రలో నటిస్తూ..శ్రీజిత్ నిష్కల, రమ్య లీడ్ రోల్స్  లో యాక్ట్ చేసిన  చిత్రం ‘చెరసాల’. కామెడీ హార్రిర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన  ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే..

వంశీ (శ్రీజిత్), ప్రియ (నిష్కల) ఒక కాలేజీలో చదువుకుంటారు. కానీ తన ప్రేమను ఒకరికొకరు చెప్పుకోరు. ఇక కాలేజ్ చదవులు పూర్తయ్యాక వంశీ, ప్రియ తన  స్నేహితులతో కలిసి ఓ వారం రోజులు పాటు ఓ టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అలా టూర్ వెళ్లిన 7 గురు  ఓ ప్రదేశంలో బంగ్లాలో స్టే చేస్తారు. అదే టైమ్ లో ఇద్దరు ప్రేమికులు ఓ గుడిలో అమ్మవారిని విగ్రహాన్ని దొంగతనం చేసి దాన్ని అమ్మేయాలనుకుంటారు. అయితే.. మార్గ మధ్యంలో వారు ప్రయాణిస్తున్న కారు చెడిపోతుంది. ఆ తర్వాత ఈ ఇద్దరు కూడా అదే బంగ్లాలో స్టే చేస్తారు. అయితే వారు ఉంటున్న ఓ ప్రేతాత్మ తిరుగుతూ ఉంటుంది. అసలు ఆ బంగ్లాలో ప్రేతాత్మ ఎందుకు ఉంది. అది అక్కడ దిగిన వాళ్లను ఎలాంటి ఇబ్బందులు పెట్టింది. చివరకు హీరో, హీరోయిన్స్ ఆ బంగ్లా నుంచి ఎలా బయటపడ్డారనేదే ఈ సినిమా స్టోరీ.

ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..

ఇదీ చదవండి:  Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగు సహా ఇతర భాషల్లో హార్రర్ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చిన ఎక్కువ మటుకు విజయం సాధిస్తున్నాయి.ఈ  రూట్లోనే దర్శకుడు రామ్ ప్రకాష్ ఇదే తరహా కథను రాసుకున్నాడు. దర్శకుడిగా ఓ పెద్ద బంగ్లాను  ఆవహించి ఉండే కోరికలు తీరని ఆత్మ.. అందులో ప్రవేశించిన హీరో, హీరోయిన్లను ఎలాంటి ఇబ్బందను ఫేస్ చేసిందనేది ఇప్పటికే మనం  పలు చిత్రాల్లో చూసాము. ఇందులో కూడా అదే తరహా రొటీన్ కథనే దర్శకుడుగా సాదాగా తెరకెక్కించాడు. ముఖ్యంగా సినిమా ప్రారంభంలో హీరో, హీరోయిన్స్ ప్రేమ.. ఆ తర్వాత ఓ లాంగ్ టూర్ వెళ్లడం వరకు బాగానే తెరకెక్కించాడు. ఇక బంగ్లాలో ప్రవేశించిన తర్వాత అసలు కథ మొదలవుతోంది. అందులో ఉన్న హీరో స్నేహితులకు దెయ్యం కనపడి వారిని భయపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో హీరో, హీరోయిన్స్ మధ్య రొమాన్స్.. చివర్లో ఆ దెయ్యం ఎలా చనిపోయిందనే రొటిన్ ఫ్లాష్ బ్యాక్ తోనే కానిచ్చేసాడు దర్శకుడు. మధ్యలో కొన్ని సన్నివేశాలతో ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా నేటి భార్యా భర్తల బంధం నీటి మీద రాతలుగా మారాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అలా లేకపోతే.. ఆ సంసారం నరకప్రాయం అని ఈ సినిమా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తంగా సినిమా మొత్తం ఓ బంగ్లాలోనే కానీచ్చేసాడు. హీరోయిన్ తన అంద చందాలతో అలరించింది. ఇక విలన్ కు జోడిగా నటించి నామె కూడా తన గ్లామర్ తో మెప్పించే ప్రయత్నం చేసింది. ఫస్టాఫ్ చాలా స్లోగా సాగడం కాస్త ఇబ్బంది పెట్టే అంశం. ఎడిటర్ తన కత్తెరకు పదును పెట్టాల్సింది. దర్శకుడు ఈ స్టోరీని ఇంకాస్త ఇంప్రవైజ్ చేసి ఉంటే ఈ సినిమా వేరే లెవల్లో ఉండేది. నిర్మాణ విలువలు ఓకే. చెరసాల టైటిల్ అనే విషయానికొస్తే.. ఓ బంగ్లానే హీరో, హీరోయిన్ సహా వారి ఫ్రెండ్స్ బయటకు వెళ్లకుండా అందులోనే బందీ చేయడమే కాన్సెప్ట్ నే ‘చెరసాల’ మూవీ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది.

నటీనటుల విషయానికొస్తే..
హీరోగా నటించిన శ్రీజిత్ తనదైన నటనతో మెప్పించే ప్రయత్నం చేసాడు. హీరోయిన్ నిష్కల ఆన్  స్క్రీన్ లుక్ బాగుంది. తన గ్లామర్ తో చిట్టి పొట్టి నిక్కరులో కుర్రకారును గిలిగింతలు పెట్టింది. ఫీమేల్ క్యారెక్టర్స్ చేసిన వాళ్లు సినిమా మొత్తం గ్లామర్ ఒలకబోసే ప్రయత్నం చేశారు.  మిగిలిన నటీనటులతో దర్శకుడు మంచి నటన రాబట్టుకుంటే బాగుండేది.

రేటింగ్: 2.75/5

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News