)
Chaitanya Rao as Hero:శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద చైతన్య రావు మదాడి హీరోగా ఐరా, సాఖీ హీరో హీరోయిన్లుగా క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి ప్రొడక్షన్ నెంబర్ .5 బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఓనమాలు’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ సెన్సిబుల్ స్టోరీలతో ఆకట్టుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్ ఇప్పుడు మరో యూత్ ఫుల్ కథతో అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నారు. కాస్త గ్యాప్ తరువాత వస్తున్న క్రాంతి మాధవ్ సరికొత్త ప్రేమ కథతో అందరినీ మెప్పించేందుకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దేవా కట్టా క్లాప్ కొట్టగా, కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ స్క్రిప్ట్ అందజేయగా.. ఫస్ట్ సీన్ కు సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో.. డైరెక్టర్ క్రాంతి మాధవ్ మాట్లాడుతూ .. దర్శకుడిగా నాకు ఐదో చిత్రం. చైతన్యతో రెండో సినిమా. పూర్ణా నాయుడు, శ్రీకాంత్ ఈ చిత్రాన్ని మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఐరా తెలుగులోకి కథానాయికగా పరిచయం అవుతోందన్నారు. సాఖీ బెంగాలీలో సీరియల్స్ చేశారు. ఈ చిత్రంతో ఆమె కూడా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పారు. చైతన్య, పూర్ణ గార్లతో నాది ఎన్నో ఏళ్ల బంధం ఉందన్నారు. . ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తరువాత పూర్ణ గారితో ఓ చిత్రాన్ని చేయాలి. హిట్స్‌లో ఉన్నప్పుడు చేయను.. బాధల్లో ఉన్నప్పుడు చేస్తాను అని అన్నారు. అలా నా గత చిత్రం ఫ్లాప్ అయినప్పుడు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ టైంలోనే పూర్ణ వచ్చి సినిమా చేద్దామని అన్నారు. న్యూ ఏజ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రాబోతోందని చెప్పారు. అందమైన లొకేషన్లలో భారీగా ఈ చితరాన్ని పిక్చరైజ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ .. ‘శ్రేయాస్ చిత్ర, పూర్ణా నాయుడు బ్యానర్లో పూర్ణా నాయుడు, శ్రీకాంత్ నిర్మాతలుగా క్రాంతి మాధవ్ అన్న డైరెక్షన్ లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రాంతి అన్నతో నాది మూడేళ్ల బంధం అన్నారు. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 2026లోనే ఆయనతో చేస్తున్న రెండు మూవీలు విడుదల కాబోతున్నాయి. నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చాలా ఇష్టమైన సినిమా. ఆయనతో వరుసగా రెండు చిత్రాలు చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. ఇంత కంటే ఎక్కువగా నేను ఆ దేవుడ్ని ఏదీ కోరుకోనన్నారు. ‘మయసభ’, ‘ఘాటీ’ తరువాత ఇంత మంచి సినిమాను చేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఓ సినిమా చేస్తున్నాను అంటే.. ఏదో ఒకటి కొత్తగా ఉంటుందనే ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఇదొక సరికొత్త లవ్ స్టోరీ. క్రాంతి అన్న చెప్పిన కథ నాకు చాలా నచ్చిందన్నారు.
నిర్మాత పూర్ణ నాయుడు మాట్లాడుతూ .. ‘క్రాంతి మాధవ్ ను నేను డైరెక్టర్ గా పరిచయం చేయాలని అనుకున్నాను. కానీ ఇన్నాళ్లకు మా ఇద్దరికీ సమయం కుదిరిందన్నారు. క్రాంతి చెప్పే కథలంటే నాకు చాలా ఇష్టం. శ్రీకాంత్ నా ప్రతీ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అవుతూనే ఉంటారు. త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియజేస్తామని చెప్పారు.
హీరోయిన్ ఐరా మాట్లాడుతూ .. ‘నా నేటివ్ ప్లేస్ బెంగళూరు. ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటాం. నేను తెలుగు సినిమాతోనే పరిచయం కావాల్సింది. కానీ తమిళ సినిమాతో నా పరిచయం జరిగింది. నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే చిత్రం చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. నేను ఆ మూవీని దాదాపు 20 సార్లు చూసి ఉంటాను. క్రాంతి మాధవ్ నుంచి నాకు ఫోన్ రావడంతో చాలా సంతోషించాను. కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం తన అదృష్టమన్నారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు . చైతన్యతో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.