)
Constable Pre Release Event: ‘కానిస్టేబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. నా కెరీర్ లో అక్టోబర్ నెలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పుకొచ్చారు. దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన ఫస్ట్ మూవీ "హ్యాపీడేస్" 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించిందని గుర్తు చేసుకున్నారు. నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయిందన్నారు. తాజాగా ‘కానిస్టేబుల్’ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు హీరో వరుణ్ సందేశ్. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. "సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయాన్ని ప్రస్తావించారు. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను కలబోతగా ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందన్నారు.
నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. "ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని ఇందులో చూపించబోతున్నామన్నారు. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను తప్పక చూడాలన్నారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ.. ఈ సినిమా ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని అమాంతం పెంచిందన్నారు. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చిందన్నారు.
ఈ వేడుకలో యువ హీరోలు అర్జున్, కార్తీక్ రాజు, విశ్వ కార్తికేయ, ఇంకా సునామీ సుధాకర్, దువ్వాసి మోహన్, కెమెరామెన్ హజరత్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, సహ నిర్మాతలు నికిత జగదీష్, కుపేంద్ర పవర్, ఇతర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.