
ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ ప్రతి ఆదివారం కథాసుధ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ (చిన్న చిత్రం)ను తమ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ సండే రోజు (జూలై 8) ‘డియర్ డాడీ’ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ అయింది. శశిధర్, శరణ్యా ప్రదీప్, రవివర్మ, వైష్ణవి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసారు. శ్రీకాంత్ దేవరకొండ డైరెక్ట్ చేశారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో చూద్దాం..
రవి (శశిధర్) మూవీ డైరెక్టర్. అతడి భార్య చంద్రిక (శరణ్యా ప్రదీప్) గవర్నమెంట్ ఎంప్లాయ్. వారి ఏకైక ముద్దుల కూతురు విస్మయ (వైష్ణవి). హ్యాపీగా సాగిపోతున్న ఈ సంసారంలో చిన్నపాటి అలజడి మొదలవుతుంది. ప్రేమించి పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న రవి, చంద్రికలు విడిపోతారు. ఈ నేపథ్యంలో చంద్రిక లైఫ్ లోకి అశోక్ (రవి వర్మ) అనే వ్యక్తి వస్తాడు. అతన్ని తల్లి రెండో పెళ్లి చేసుకోవడం కూతరు విస్మయకు ఇష్టముండదు. అతడు ఎంత ప్రేమ చూపించినా.. పెద్దగా పట్టించుకోదు. ఇక మేజర్ అయ్యేంత వరకు తల్లి వద్ద పెరిగిన విస్మయ.. ఆ తర్వాత తాను కోరకున్నట్టు తండ్రి దగ్గరకు వెళుతుంది. చిన్నపుడు తనను ఎంతో అపూరూపంగా చూసుకున్న తండ్రిలో అనూహ్య మార్పుతో విస్మయ నిజంగానే విస్మయానికి గురవుతుంది. తన కన్నతండ్రిలో వచ్చిన ఈ మార్పుతో విస్మయ.. బెంగళూరు నుంచి తల్లి వద్దకు వచ్చిందా.. ఇంతకీ కన్నతండ్రి రవితో వచ్చిన మార్పులేమిటి.. ? రవి, చంద్రికల మధ్య దూరం ఎందుకొచ్చిందనేది తెలియాలంటే ఈ షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
గత కొన్నేళ్లుగా మన సమాజంలో భార్యా భర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. అలాంటి సున్నితమైన విడాకుల అంశాన్ని తన కథగా తీసుకున్నాడు. పెద్దలు డైవోర్స్ తీసుకోవడంతో వాళ్లు హ్యాపీగా ఉన్నా.. పిల్లలు మాత్రం తల్లిదండ్రులు విడిపోవడంతో ఎంతో స్ట్రగుల్ అవుతారు. పెరిగే క్రమంలో ఇద్దరి ప్రేమలను పొందాల్సిన చిన్న హృదయాలు.. ఒకరితో మాత్రమే కలిసి ఉండటం వారిని కలిచివేస్తుంటాయి. ఇలాంటి సున్నిత అంశంతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ పెద్దలను ఆలోచింపజేసేలా ఉంది. పెద్దలు విడిపోవడంతో రగిలిపోయే అమ్మాయి పాత్రలో విస్మయ క్యారెక్టర్.. రక్త సంబంధాన్ని మించిన బంధం లేదనేది అశోక్ పాత్రతో గుండెలకు హత్తుకునేలా కథ, కథనాలను మంచిగా రాసుకున్నాడు శ్రీకాంత్. డైరీ జ్ఞాపకాలను గుర్తుచేసే ప్రయత్నం చేశారు. డైరీ ఈ స్టోరీలో కీలకం అని చెప్పాలి.
ముఖ్యంగా సెకండాఫ్ లో కన్నతండ్రి దగ్గరకు వెళ్లే క్రమంలో విస్మయ.. ఓ పెద్ద మనిషిని కలుస్తుంది. అందులో ఏకాంతానికి, ఒంటరితనానికి అతడు తేడా చెప్పడం ప్రేక్షకులు ఆలోచింపజేస్తాయి. విస్మయ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడానికి గల కారణాన్ని సినిమా క్లైమాక్స్ ముందు రివీల్ చేయడం బాగుంది. కేవలం నాలుగు పాత్రలతో సాగే ఈ షార్ట్ ఫిల్మ్ 48 నిమిషాలుంది.
నటీనటుల విషయానికొస్తే..
తల్లిదండ్రుల పాత్రలో శరణ్యా ప్రదీప్, శశిధర్ నటన బాగుంది. విస్మయ పేరేంట్స్ విడాకులతో ఆమె ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసిందనే అమ్మాయి పాత్రలో నటించింది. రవివర్మ, చిన్నప్పటి విస్మయ పాత్రలో నటించిన సహస్య, ప్రదీప్ తమ నటనతో మెప్పించారు. ఈ వారం తప్పక ఈటీవీ విన్ లో చూసేయండి..
పంచ్ లైన్.. గుండెలను హత్తుకునే ‘డియర్ డాడీ’..
రేటింగ్: 2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.