Tollywood New Movie: బడా బ్లాక్ బ్లాస్టర్ దర్శకుల చేతుల మీదుగా ప్రారంభమైన దీపక్ సరోజ్ కొత్త చిత్రం..

Tollywood New Movie: చాలా సినిమాల్లో బాల నటుడిగా మెప్పించిన దీపక్ సరోజ్.. రీసెంట్ గా సిద్దార్ధ రాయ్ సినిమాతో హీరోగా ప్రమోషన్ పొందారు. తాజాగా ఆయన హీరోగా కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కల్ట్ లవ్ స్టోరీ జానర్ లో డఫరెంట్ మూవీగా తెరకెక్కబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 5, 2024, 08:50 PM IST
Tollywood New Movie: బడా బ్లాక్ బ్లాస్టర్ దర్శకుల చేతుల మీదుగా ప్రారంభమైన దీపక్ సరోజ్ కొత్త చిత్రం..

Tollywood New Movie: నేటి బాలలే.. రేపటి పౌరులు అన్నట్టు.. నేటి బాల నటులే.. రేపటి హీరోలు మన దగ్గర బాల నటులుగా మెప్పించిన చాలా మంది స్టార్స్ అయ్యారు. మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ బాల నటులుగా మెప్పించిన వారే. ఈ కోవలో తెలుగులో ఎన్నో సినిమాల్లో బాల నటుడిగా మెప్పించిన దీపక్ సరోజ్.. రీసెంట్ గా ‘సిద్ధార్ధ రాయ్’ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా ఈయన హీరోగా  శ్రీ లక్ష్మీనరసింహ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైంది. హరీష్ గదగాని డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు.  ఈ చిత్రంతో తన్నీరు హరిబాబు నిర్మాతగా మారారు. దీక్షిక, అనైరా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో రఘుబాబు, సత్య, యూట్యూబర్ పుంజు, యాదమ్మ రాజు, హైపర్ ఆది, రచ్చ రవి వంటి వారు ఇతర లీడ్ రూల్స్ లో నటిస్తున్నారు.  
 
ఈ రోజు పలువురు సమక్షంలో ఈ చిత్రాన్ని సినిమా ఆఫీసులో వైభవంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్స్ వేణు ఊడుగుల,  కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదు వంశీ , క ఫేమ్ సుజిత్- సందీప్, ప్రదీప్ మద్దాలి, సందీప్ సరోజ్, భరత్ పెద్దగాని, ఉదయ్ శర్మ, వంశీ చాగంటి, హైపర్ ఆది, రచ్చ రవి హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం ఈ మూవీ స్క్రిప్ట్ ని ప్రదీప్ మద్దాల, యదువంశీ అందించారు.  వేణు ఉడుగుల క్లాప్ కొట్టారు. సుజిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా ఫస్ట్ షాట్ కి సందీప్ డైరెక్షన్ చేశారు.

Add Zee News as a Preferred Source

పూజా కార్యక్రమాల అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ .... ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకులకి ధన్యవాదాలు.  నా పేరు హరీష్ ఇది నా మొదటి సినిమా. కథ చెప్పగానే నిర్మాత వెంటనే స్టార్ట్ చేద్దామన్నారు.  ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ కథ ఒప్పుకున్నందుకు మా హీరో దీపక్ , హీరోయిన్ అనైరా ఇద్దరికీ ధన్యవాదాలు  చెబుతున్నాను.

హీరో దీపక్ సరోజ్ మాట్లాడుతూ..  గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నాన్నోయ్ రైలు తెమ్మన్నాను తెచ్చావా? అన్న ఆ అబ్బాయిని నేనే. సిద్ధార్థ రాయ్ సినిమాతో నన్ను హీరోగా ఆదరించారు. నా పేరు దీపక్ సరోజ్. ఈ సినిమా డైరెక్టర్ హరీష్  ఒక మంచి లవ్ స్టోరీతో  వస్తున్నారు. నేను మంచి కథ కోసం చూస్తున్నప్పుడు ఈ స్టోరీ విన్నాను నేను కచ్చితంగా చెప్పాల్సిన కథ అనిపించింది.సినిమా తప్పకుండా హిట్ అవుతున్న నమ్మకం వ్యక్తం చేశారు.

హీరోయిన్ అనైరా మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగమైనందుకు నేను ఎంతో హ్యాపీగా ఉందన్నారు.  ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను. మా దర్శక,నిర్మాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక బయట వ్యక్తికి సినిమా అవకాశం రావడం మామూలు విషయం కాదు. కానీ వారు నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నాకు ఛాన్స్ ఇచ్చారు. సినిమా అందరి నచ్చుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.  

నిర్మాత హరిబాబు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను. సినిమా మీద ఉన్నఅభిమానంతో   లక్ష్మీనరసింహ ఆర్ట్స్ అనే బ్యానర్ స్థాపించాను. ఇకపై ఈ బ్యానర్ లో వరుస సినిమాలు నిర్మిస్తాను. దర్శకుడు మూవీ కథ చెప్పిన వెంటనే నాకు బాగా నచ్చింది. వెంటనే హరీష్ స్టోరీకి ఒకే చెప్పాను. చిన్నప్పటి నుంచి నాకు సినిమా రంగం అంటే చాలా ఇష్టంగా ఉండేది. అందుకే సినీ నిర్మాతగా మారాను. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందననే ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి:  టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News