Devagudi:నిజ జీవిత గాథతో వస్తోన్న ‘దేవగుడి’.. టీజర్ పై హీరో శ్రీకాంత్ ప్రశంసలు..

Devagudi: కొత్త నటీనటులతో పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘దేవగుడి’.   లక్ష్మీకాంత్ కనికే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.   

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 14, 2025, 04:47 PM IST
Devagudi:నిజ జీవిత గాథతో వస్తోన్న ‘దేవగుడి’.. టీజర్ పై హీరో శ్రీకాంత్ ప్రశంసలు..

 Devagudi Teaser Talk: టీజర్ విడుదల తర్వాత హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘2013లో రామకృష్ణా రెడ్డి నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఎంతో అభిరుచితో తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా సినిమాలు నిర్మించి సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.  అప్పట్లో ఆయన సినిమా గురించి చెబుతుంటే.. మీరే డైరెక్షన్ చేయవచ్చు కదా అనేవాడిని. అలా ఆయన దర్శకుడు అయ్యారు. ‘దేవగుడి’ మూవీతో  దర్శకుడు అయ్యారు. ఈ టీజర్ చూస్తే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడి తీసాడా అనిపించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్‌గా జరిగిన స్టోరీ నే సినిమాగా తెరకెక్కించారని  చెప్పుకొచ్చారు.  నాకు ఈ స్టోరీ ముందుగానే తెలుసు. రియల్‌గా జరిగిన స్టోరీ ఇది. కచ్చితంగా అందరినీ అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లకు నేను చెప్పేది ఒక్కటే. అందరూ కష్టపడే ఇక్కడ వరకు వస్తారు. ఇక్కడకు వచ్చిన తర్వాత కూడా అంతే కష్టపడుతూ ఉండాలి.  సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి కామన్. కానీ డిజప్పాయింట్ అవకుండా ముందుకు వెళుతూనే ఉండాలన్నారు. డిసెంబర్ 19న థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. 

Add Zee News as a Preferred Source

దర్శకనిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఈ వేడుకకు వచ్చిన మీడియా మిత్రులకు, బంధుమిత్రులకు అందరికీ పేరు పేరునా  ధన్యవాదాలు. 2013లో శ్రీకాంత్‌గారితో పుష్యమి ఫిలిం మేకర్స్ ప్రారంభించాము.  శ్రీకాంత్‌గారు ఏ నోటితో అన్నారో ఆ రోజు.. ‘భయ్యా నువ్వు డైరెక్టర్ అయిపోవచ్చుగా అని’.. ఆ తర్వాత నేను డైరెక్టర్‌గా మారాను. ‘దృశ్యకావ్యం’ చేశాను. ఇప్పుడు ‘దేవగుడి’ మూవీతో పలకరించబోతున్నాను. డిసెంబర్ 19న ‘దేవగుడి’ ఫైర్ ఉంటుంది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నామని కాన్ఫిడెన్స్ గా చెప్పుకొచ్చారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను చూసి  మెచ్చుకున్నారు. ఈ మూవీలో స్క్రీన్‌ప్లే అందరినీ ఆశ్చర్యపరుస్తుందన్నారు.  ఎంటైర్ టీమ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా చేశాం. రఘు కుంచె‌గారు అద్భుతమైన పాత్ర చేశారు. ఆయన ఈ చిత్రం కోసం  ఎంతగానో సహకరించారు. తప్పకుండా ఈ  సినిమా సక్సెస్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read more: రెబల్ స్టార్ ప్రభాస్ ఇంటిని చూశారా.. ఏకంగా మాహిష్మతిని తలదన్నేలా ఉన్న రాజా సాబ్ భవనం..!

Read more: ప్రభాస్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా..! అస్సెట్స్ విషయంలో నిజంగానే బాహుబలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News