)
Ento Antha Sarikothaga: తెలుగులో విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్రేమ కథా చిత్రాలు వచ్చి చాలా కాలమే అవుతోంది. ఈ నేపథ్యంలో ‘ఏంటో సరికొత్తగా’ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాము ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాము.ఎం నిర్మాతగా రాజ్ బోను డైరెక్షన్ లో తెరకెక్కించిన చిత్రం ‘ఏంటో అంతా సరికొత్తగా’. ఈ అందమైన గ్రామీణ లవ్ స్టోరీ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల, హర్షిత హీరో, హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు.
‘ఏంటో అంతా సరికొత్తగా’ టైటిల్‌కు తగ్గట్టుగా ఈ మూవీ బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉండబోతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో హీరో, అతని స్నేహితులు టోల్ గేట్ వద్ద పని చేస్తుంటారు. గ్రామీణ వాతావరణం, టోల్ గేట్ వద్ద జరిగే సంఘటనలు చూపిస్తూ అందమైన లవ్ స్టోరీని పెద్ద తెరపై ఆవిష్కరించబోతోన్నారు. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఎంతో క్యూట్ గా కూల్‌గా ఆకట్టుకునేలా ఉంది.
అన్ని రకాల అంశాలను మేళవించి ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా ‘ఏంటో అంతా సరికొత్తగా’ చిత్రాన్ని తెరకెక్కించారు. పల్లెటూరి వాతావరణం, ప్రశాంతత నేపథ్యంలో చాలా కూల్‌గా, ఆహ్లాదకరంగా సాగే ఓ అపురూపమైన ప్రేమ కథగా ఇది రాబోతుంది. ‘ ఏంటో అంతా సరికొత్తగా ’ నిజంగానే సరికొత్తగా ఉండబోతుందా అనేది చూడాలి. త్వరలోనే ఇతర కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన సెన్సార్ కు వెళ్లనుంది. ఆ తర్వాత రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.