Erra Gulabi: ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో ఆసక్తిరేకిస్తోన్న ‘ఎర్ర గులాబి’ మూవీ..

Erra Gulabi first Look: శ్రేయసి షా కథానాయికగా గా పరిచయం అవుతున్న లేటెస్ట్ మూవీ ‘ఎర్ర గులాబి’.  యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకం పైన, మనోహర్ చిమ్మని డైరెక్షన్ లో  ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా ‘ఎర్ర గులాబి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను యువ నిర్మాత ఎస్ కే యన్ లాంచ్ చేశారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 23, 2025, 11:39 AM IST
 Erra Gulabi: ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో ఆసక్తిరేకిస్తోన్న ‘ఎర్ర గులాబి’ మూవీ..

Erra Gulabi first Look: ఎర్ర గులాబి ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మోషన్ పోస్టర్ ను డైనమిక్ ప్రొడ్యూసర్ యస్ కె ఎన్ శనివారం లాంఛ్ చేశారు. ఫస్ట్ లుక్ టెర్రిఫిక్ గా ఉంది. సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు SKN. అంతేకాదు యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలియ జేసారు.  ప్రెజెంట్ సమాజంలోని పలు సున్నితమైన అంశాల్లో - ఈతరం యూత్ కు నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి.  హీరోయిన్ ఓరియెంటెడ్ రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా ‘ఎర్ర గులాబి’ షూటింగ్ పూర్తైయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

Add Zee News as a Preferred Source

ఈ చిత్రంలో  యువతరాన్ని హుషారెత్తించే ఒక తెలంగాణ ఫోక్ సాంగ్‌, ఇంగ్లిష్ సాంగ్‌తో కలిపి మొత్తం 3 డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. లేడీ "యానిమల్"ను తలపించేలా మంచి యాక్షన్  సీన్స్ ప్రేక్షకులను గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.  
ప్పట్లాగే కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, నంది అవార్డు రచయిత-దర్శకుడు మనోహర్ చిమ్మని, ఈ సినిమాలో కూడా చాలామంది కొత్త నటీనటులకు, టెక్నీషియన్లకు ఛాన్స్ ఇచ్చారు.

శ్రేయసి షా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో - నరేంద్ర, వెంకట్, సోమయాజి, షబీనా, మిల్కీ, యాంకర్ అను, విజయేంద్ర మొదలైనవాళ్ళు  లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు.  ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్రలో జబర్దస్త్ వీరబాబు నటించాడు. ప్రముఖ అభ్యుదయ చిత్రాల దర్శకుడు బాబ్జీ ఈ సినిమాలో ఒక సెన్సేషనల్ క్యారెక్టర్ లో  యాక్ట్ చేయడం విశేషం.

మనూటైమ్ మూవీ మిషన్ సమర్పణలో  "ఎర్ర గులాబి" సినిమా తెరకెక్కుతోంది.  పోస్ట్ ప్రొడక్షన్ పనులు త్వరలో పూర్తవుతున్నాయి. అంతేకాదు త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. 

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News