Year Ender 2025: కోట్ల మంది నెటిజన్లు తమకు కావాల్సిన వాటిని ఎంచ్కా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. వాటి గురించి తెలుసుకుంటున్నారు.అందులో ఉండేవన్ని నిజాలని చెప్పలేము. మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అదే అందులో ఉంటుంది. దీంతో ఈ అంశం ఇపుడుట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. గూగుల్ జాబితా అంతటా నెటిజన్ల వ్యవహారశైలి, ఆలోచనాతీరుకు అద్ధంపడుతోంది. ఇంతకీ ఈ సంవత్సర కాలంలో నెటిజన్లు దేనికోసం వెతికారు? ఏం తెలుసుకున్నారు? అనే విషయానికొస్తే. విశాలమైన భారతదేశంలో ఒక్కొక్కరిది ఒక్కో ఆలోచన.. విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు, మహిళలు వేర్వేరు ఆలోచనలతో గూగుల్ వెతకడం, దాన్నిగురించి తెలుసుకోవడం అలవాటైపోయింది. దీంతో గూగుల్ సెర్చ్ ఇంజిన్ టాప్ సెర్చింగ్ ప్రాధాన్యత అంశాలతో ప్రత్యేక నివేదిక రూపొందించింది. 2025 సంవత్సరంలో గూగుల్ సెర్చ్ రిపోర్టును పరిశీలిస్తే..ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అందుబాటులోకి వచ్చిన ఆధునికి టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని నెటిజన్లలో ఆసక్తి పెరిగింది.దేశంలో ఎక్కడైన ఆందోళనకర ఘటన చోటుచేసుకున్నపుడు దాన్ని గురించి తెలుసుకోవాలనే ఆతృత నెటిజన్లలో కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రజలు స్పోర్ట్స్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ లేదా సినిమా వినోదం, జాతీయ కార్యక్రమాలు, సంగీత సాంస్కృతిక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత అవసరాల కోసం గూగుల్ లో ఎక్కువగా వెతికి తెలుసుకున్నారు. ఆత్యధికంగా కోట్ల మంది ఇండియన్ ప్రీమియర్ లీగ్, మహిళా క్రికెట్ అంశాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. మహిళల వరల్డ్ కప్, ఇండియా - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఈ ఆటలో కీ రోల్ పోషించిన జెమీమా రోడ్రిగ్స్, షెఫాలి వర్మ, స్మృతి మంథన గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్ లో వెతకడంతో ట్రెండింగ్ లోకి వచ్చారు. అలాగే పురుషుల క్రికెట్లో సంచలన బ్యాటింగ్ తో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ట్రెడింగ్ లో నంబర్ వన్ స్థానంలోకి వచ్చారు.
టెక్నాలజీ పరంగా గూగుల్ జెమిని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, నానో బనానా వంటి ట్రెండ్‌లకు సంబంధించి సెర్చ్ ఫలితాలు హైలెట్ గా నిలిచాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత... కొత్త సెర్చ్ ఫీచర్ల శ్రేణి విడుదలైంది. ఎక్కువమంది భారత దేశంలో వినిగించేందుకు ఆసక్తి చూపారు.AI మోడ్‌లో జెమిని 3, నానో బనానా ప్రో , వర్చువల్ అప్పారెల్ ట్రై ఆన్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.
విద్యా సంబంధ అంశాలు, ఇతర వస్తువులతో పోలికలు, క్రియేటివ్ పనులకు సంబంధించి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి ఆసక్తి చూపించారు. దశలవారీ వివరణలలో సంక్లిష్టమైన ప్రశ్నలకు జెమిని-ఆధారిత తార్కికంపై ప్రజలు ఆధారపడటంతో, AI మోడ్ వినియోగం గణనీయంగా విస్తరించిందని గూగుల్ నివేదికలో పేర్కొంది. నోట్‌బుక్LM-జనరేటెడ్ సారాంశాలు, ఆడియో ఓవర్‌వ్యూలు, నానో బనానా ప్రో-జనరేటెడ్ విజువలైజేషన్‌లను మొదటిసారిగా బహుళ ఫార్మాట్‌లలో వెతికి తెలుసుకున్నారు.
వినోద రంగంలో స్క్విడ్ గేమ్ షో అగ్రస్థానంలో నిలిచింది. స్పేస్ టెక్నాలజీ సంబంధ విషయంలో అంతరిక్షయాత్రలో వ్యోమగామి సునీతా విలియమ్స్ విషయం దేశవ్యాప్తంగా ఆసక్తిరేకెత్తించడంతో నెటిజన్లు విపరీతంగా వెతికినట్టు తెలుస్తోంది. దీంతో వ్యోమగామి సునీత విలియమ్స్ టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.
Read more: Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..
Read more: నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు..
ఆధ్యాత్మిక భావనతో భారతదేశంలోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహాకుంభ మేళా గురించి తెలుసుకునేందుకు చాలామంది ప్రయత్నించారు. దీంతో వార్తాంశాల్లో మహాకుంభ్ విషయం అగ్రస్థానంలో నిలిచించి. పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ గురించి తెలుసుకునేందుకు విస్తృతంగా వెతికారు. భారతదేశంలో పాండిచ్చేరి పర్యాటక ప్రాంతం కోసం నెటిజన్ల ఆసక్తికి అద్ధం పట్టింది. భూకంపం ఎక్కడ జరుగుతుంది, వాతావరణంలో గాలి నాణ్యత శాతం అనే విషయాలను గూగుల్ లో పరిశోధించారు. 2
2025 హిట్ సినిమాల్లో కాంతారా, సయ్యారా వంటి వైరల్ సెన్సేషన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవల భౌతికంగా దూరమైన హీరో ధర్మేంద్ర ఆరోగ్య విషయం గురించి నెటిజన్లు ఎక్కువగా ఆరాతీశారు. గూగుల్ లో వెతకడంలో హీరో ధర్మేంద్ర ట్రెండింగ్ లోకి వచ్చి టాప్ 10లో నిలిచారు. వార్తల పరంగా హీరో ధర్మేంద్ర రెండో స్థానంలో నిలిచారు.వక్ఫ్ మొత్తంమీద గూగుల్ సెర్చ్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ అగ్రస్థానంలో నిలిచాయి. డేటింగ్ పరిభాషను డీకోడ్ చేయడం, AI ఇమేజ్ ప్రాంప్ట్‌లతో ప్రయోగాలు చేయడం , వంటకాలను నేర్చుకోవడం కోసం వినియోగదారులు అత్యధికంగా గూగుల్ ను సెర్చ్ చేశారు.
(రచయత..మునిరాజ్ జీ న్యూస్ డెస్క్)
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.









