Guard Movie Review:‘గార్డ్’ మూవీ రివ్యూ..

విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'గార్డ్'. రివెంజ్ ఫర్ లవ్ అనేది ట్యాగ్‌లైన్‌. అను ప్రొడక్షన్స్‌ పతాకంపై  అనసూయ రెడ్డి నిర్మాతగా  జగ పెద్ది డైరెక్షన్ లో తెరకెక్కింది. శిల్పా బాలకృష్ణ లీడ్ రోల్లో యాక్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 28, 2025, 06:06 PM IST
Guard Movie Review:‘గార్డ్’ మూవీ రివ్యూ..

మూవీ రివ్యూ: గార్డ్ (Guard)
నటీనటులు:  విరాజ్ రెడ్డి, మిమి లియనార్డ్, శిల్పా బాలకృష్ణ,మురళి పరిషే, కమల్ కృష్ణ,  తదితరులు
సంగీతం: సిద్ధార్ధ్ సదాశివుని
సినిమాటోగ్రఫీ: మార్క్ కెన్ ఫీల్డ్
ఎడిటర్: రాజ్ మేడా
నిర్మాతలు: అనసూయ రెడ్డి
దర్శకత్వం: జగ్గా పెద్ది
విడుదల తేది: 28-2-2025

Add Zee News as a Preferred Source

విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన చిత్రం 'గార్డ్'. రివెంజ్ ఫర్ లవ్ అనేది ట్యాగ్‌లైన్‌. అను ప్రొడక్షన్స్‌ పతాకంపై  అనసూయ రెడ్డి నిర్మాతగా  జగ పెద్ది డైరెక్షన్ లో తెరకెక్కింది. శిల్పా బాలకృష్ణ లీడ్ రోల్లో యాక్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే.. 

‘గార్డ్’ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా  స్టోరీ మొత్తం ఆస్ట్రేలియాలో నేపథ్యంలో జరుగుతుంది.  ఆదేశంలో సెటిల్ అయిన సుశాంత్(విరాజ్ రెడ్డి)ఓ హాస్పిటల్ లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ గా సనిచేసే సామ్(మిమీ లియానార్డ్)తో తొలి చూపులోనే లవ్ లో  పడతాడు. అయితే సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్ లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనని కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళతాడు. అయితే.. అక్కడ ఎవరు ఓపెన్ చేయని ఓ రూమ్ ఉంటుంది. ఆ గది తెలుపు తెరవగానే.. అందులోంచి ఓ ఆత్మ ఆమె శరీరంలోకి వెళుతుంది. ఆ తర్వాత ఏమైంది. ఆ ఆత్మ వల్ల సుశాంత్ ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసాడు. ఆ ఆత్మకు సుశాంత్ కు ఉన్న సంబంధం ఏమిటనేదే మిగిలిన కథ.  

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

చనిపోయిన అమ్మాయి .. ఆత్మ వేరే శరీరంలోకి ప్రవేశించి తన ప్రతీకారం ఎలా తీర్చుకుందనేదే ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్. మొత్తంగా తాను రాసుకున్న కథను ఎంతో కన్ప్యూజన్ లేకుండా ఏ సీన్ తర్వాత ఏ సీన్ అనేది ఒక క్రమ పద్ధతిలో స్క్రీన్ ప్లే రాసుకోవడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు. సినిమా మొత్తం ఆస్ట్రేలియాలో జరగడం, అక్కడ గార్డ్ గా పనిచేసే హీరోతో కొత్తగా భయపెట్టడానికి ట్రై చేయడం ఫ్రెష్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో - హీరోయిన్ పాత్రల పరిచయం, వారి ప్రేమతో సరదగా సాగిపోవడం.. మద్యలో ఓ అనుకోని గది తెరవగానే.. ఆత్మ హీరోయిన్ శరీరంలోకి ప్రవేశించడం. ఆత్మ మారిన ఆమె ఎవరు.. ? హీరోతో సంబంధం అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పాలి.  సినిమా విరామ సమయంలో  ఆత్మ సామ్ లోకి దూరడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో కలిగించడంలో సక్సెస్ అయ్యాడు.  

ఇక సెకండ్ హాఫ్ లో ఆ ఆత్మ ఏం చేసిందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.  తనని చంపింది ఎవరు? తన స్టోరీ ఏంటి? హీరో ఆ ఆత్మకు ఎలా సపోర్ట్ చేసాడు అనేది సినిమా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా చేసాడు. ముక్యంగా ఇప్పటి యూత్ కు తగ్గట్టు ఎక్కువగా ఇంగ్లీష్ డైలాగ్స్ ఉండటంతో యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.  సినిమాటోగ్రఫీ విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.    కథ... కథనం కొత్తగా చూపించి భయపెట్టడంలో డైరెక్టర్  సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా లావిష్ గా ఉంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా క్వాలిటీ గా నిర్మించాడు.

నటీనటుల విషయానికొస్తే..  

విరాజ్ రెడ్డి చీలం కొత్తవాడైనా చక్కగా తన పాత్రలో ఒదిగిపోయాడు.  మిమీ లియానార్డ్ గ్లామర్ తో ఆకట్టుకుంది. అన్ని హద్దులు చెరిపేసింది.  శిల్ప బాలకృష్ణన్ కూడా తన యాక్టింగ్ తో  మెప్పించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించింది.  నెగిటివ్ షేడ్స్ లో కమల్ కృష్ణ నటన ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో ఒదిగిపోయిన తీరు మెప్పిస్తోంది.  నటించి మెప్పించారు.

పంచ్ లైన్.. ‘గార్డ్’..ఎంగేజింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ..

రేటింగ్: 2.75/5

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News