ఈ మధ్యకాలంలో సోలో క్యారెక్టర్ తో పలు చిత్రాలు వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘హలో బేబి’ అనే చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో కాండ్రేగుల ఆదినారాయణ నిర్మాణంలో కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా ‘హలో బేబీ’ అనే చిత్రం తెరకెక్కింది. ఒక్క క్యారెక్టర్ తో హ్యాకింగ్ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉండో మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
ఆద్య ( కావ్య కీర్తి ) బెంగళూరులో సాప్ట్ వేర్ జాబ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంట్లో ఒక్కతే ఉంటూ ర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటుంది. వర్క్ చేయడం అమ్మతో ఫ్రెండ్ తో తరుచుగా ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఆద్య కాలేజీ ఫ్రెండ్ రాహుల్ ఫోన్ చేస్తాడు. అప్పటి నుండి ఆద్యకి కొన్ని సమస్యలు మొదలవుతున్నాయి. ఇంట్లో ఆద్య ఏం చేస్తుందో ఏ డ్రెస్ లో ఉందో అన్ని చెప్పి ఆద్య నీ భయపెడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఆద్య ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఫేస్ చేసింది. ఇంతకీ ఆద్యకు ఫోన్ చేసిన ఆగంతకుడు ఎవరు.. ? చివకు ఈ సమస్య నుంచి బయట పడిందా లేదా అనేదే ‘హలో బేబి’ సినిమా స్టోరీ.
నటన, కథనం, విశ్లేషణ:
తెలుగులో సింగిల్ క్యారెక్టర్ తో సినిమాలు చేయడం అనేది అప్పట్లో రామ్ గోపాల్ వర్మ స్టార్ట్ చేసారు. హాలీవుడ్ లో ఇలాంటి తరహా సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హిందీలో కూడా వచ్చాయి. తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తక్కువే వచ్చాయి. ఒక క్యారెక్టర్ తో సినిమా మొత్తాన్ని రన్ చేయడం అంటే దర్శకుడికి కత్తి మీద సామే. దర్శకుడు హీరోయిన్ కీర్తితో ఈ ఫీట్ ను సాధించాడు. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఫేస్ ఉద్యోగ రీత్యా అనుభవిస్తున్న ప్రాబ్లెమ్స్ ను ఈ సినిమాలో ఏకరువు పెట్టాడు. ముఖ్యంగా ఓ ఇంట్లో ఒంటిరిగా ఉండే అమ్మాయిపై కొంత మంది పోకిరిలు ఎలా వేధిస్తారనేది ఈ సినిమాలో చూపెట్టారు. ఇంట్లో ఒంటరి గా ఉంటే ఎలా ఉంటుందో ఆ భయాన్ని రాబట్టుకున్నాడు. సినిమా మొత్తం కావ్య ఒక్కతే ఉంటుంది. ఫస్ట్ టైమ్ టాలీవుడ్ లో సింగిల్ హీరోయిన్ మూవీ హలో బేబీ ఒక కొత్త ప్రయోగం అనే చెప్పాలి.
ఒక్కటే ఇంట్లో సినిమా మొత్తం తీసి మెప్పించడం అంటే మాములు విషయం కాదు. తర్వాత సన్నివేశం ఏం జరుగుతుంది అనే స్క్రీన్ ప్లేతో బాగా చూపించాడు డైరెక్టర్.కెమెరా వర్క్ బాగుంది, మంచి లైటింగ్స్ లో సినిమాను గుడ్ విజువల్స్ తో తెరకెక్కించాడు దర్శకుడు. ఎడిటింగ్ బాగుంది, సినిమాను ఎక్కువగా సోది లేకుండా ఎడిటర్ బాగానే కట్ చేశారు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే విధంగా ఉంది. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రామ్ గోపాల్ రత్నం ఆయన టేకింగ్ చాలా బాగుంది. సినిమాను ఎక్కడా బోరింగ్ లేకుండా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించడం విశేషం. ఇలాంటి పాయింట్ తో సినిమా తీసినందుకు డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం ను అలాగే నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ ను మెచ్చుకోవాల్సిందే.
నటిగా కావ్య తన నటనతో ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాల్లో తన అభినయంతో ఎక్స్ ప్రెషెన్స్ తో మెప్పించింది. నటిగా మంచి భవిష్యత్తు ఉంది.
పంచ్ లైన్.. థ్రిల్ చేసే ‘హలో బేబి’..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.