మూవీ రివ్యూ: జిగేల్ (Jigle)
నటీనటులు: త్రిగుణ్, మేఘా చౌదరి, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, షాయాజీ షిండే, 30 ఇయర్స్ పృథ్వీ,మధునందన్, ముక్కు అవినాశ్, మేక రామకృష్ణ, నళిని, జయ వాణి, అశోక్, గడ్డం నవీన్, చందన, రమేష్ నీల్, అబ్బా టీవీ డా. హరిప్రసాద్ తదితరులు
సంగీతం: మంత్ర ఆనంద్
సినిమాటోగ్రఫీ: వాసు
ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరరావు
నిర్మాతలు: వై. జగన్ మోహన్, అల్లం నాగార్జున,
దర్శకత్వం: మల్లి యేలూరి
విడుదల తేది: 7-3-2025
త్రిగుణ్, మేఘా చౌదరి హీరో, హీరోయిన్లుగా యాక్ట్ చేసిన చిత్రం ‘జిగేల్’. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని మల్లి యేలూరి డైరెక్ట్ చేశారు. నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. ఈ చిత్రాన్ని డాక్టర్ వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
నందు(త్రిగుణ్) ఓ లాకర్ టెక్నీషియన్. అయితే లైఫ్ లో ఒక్క దెబ్బకు సెటిలైపోవాలనుకే బాపతు. దీంతో లాకర్లను దొంగతనంగా తీస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి కలలో మీనా(మేఘా చౌదరి) అనే అమ్మాయి వస్తూ వుంటుంది. ఆ స్వప్నంలో రొమాన్స్ చేస్తున్నట్టు వస్తుంటాయి. అయితే కలలో కనపడిన అమ్మాయి అతనికి అనుకోకుండా కళ్ల ముందు ప్రత్యక్ష మవుతోంది. ఆ అమ్మాయి కూడా నందు తరహాలో ఓ చిన్న సైజు దొంగ. అప్పటి నుంచి వీళ్లిద్దరు కలిసి దొంగతనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో రాజా చంద్ర వర్మ ప్యాలెస్ లో వుండే ఎప్పటి నుంచో ఓ పురాతన లాకర్ తెరుచుకోవడం లేదని మీనాకి తెలుస్తుంది. దాంతో ఆమె జేపీ(సాయాజీ షిండే) దగ్గర పి.ఎ.గా చేరి... ఆ లాకర్ ను తన ప్రియుడైన నందుతో ఓపెన్ చేయించాని చూస్తోంది. మరి ఆ లాకర్ ను చివరకు తెరిచారా? ఆ లాకర్ లో ఏ ముంది? ఆ లాకర్ నిజానికి ఎవరిది? రాజా చంద్ర వర్మ ప్యాలెస్ ఎవరిది? దానికి హీరోయిన్ మీనాకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు జేపీ ఎవరు? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
తెలుగు సహా ఇతర భాషల్లో సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ మూవీస్ ఎన్నో వచ్చాయి. కానీ ఈ మధ్యకాలంలో మేకర్స్ రొటీన్ సినిమాలు కాకుండా కాస్త వెరైటీ థ్రిల్లర్ కాన్సెప్ట్ మూవీలను తెరకెక్కించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక యూత్ ఆడియన్స్ కూడా రెగ్యులర్ సినిమాలు కాకుండా ఇలాంటి సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు స్క్రీన్ ప్లే ఇంపార్టెంట్. ప్రేక్షకులు థియేటర్స్ లో సీట్లో కదలనీయకుండా చేస్తేనే సక్సెస్ అయినట్టు. దర్శకుడు మల్లి యేలూరి.. తాను అనుకున్న సబ్జెక్ట్ ను పకడ్బందీగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు.
ఈ సినిమాుక నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం అందించిన స్టోరీ, స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను నవ్వించేలా రాసుకున్నాడు. అది థియేటర్స్ లో పండిందనే చెప్పాలి. మరి యువతను ఆకట్టుకునే రొమాంటిక్ సీన్స్ కూడా బాగున్నాయి. ఇంకోవైపు ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే ఎమోషన్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ప్రథమార్ధంలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అట్రాక్ట్ చేస్తాయి. అలాగే పోసాని వేసిన ఆండ్రాయిడ్ బాబా వేషం ప్రేక్షకులను నవ్విస్తాయి. పోసానికి రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే లాయర్ మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ చేత చేయించిన కామెడీ ఫుల్ గా వర్కవుట్ అయింది. ఇక సెకెండాఫ్ లో అసలు కథ మొదలై... చివరి వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లాకర్ చుట్టూ రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే అట్రాక్టివ్ గా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేసేలా ఉంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
నిర్మాత నాగార్జున అల్లం రాసిన స్టోరీ, స్క్రీన్ ప్లేను దర్శకుడు మల్లి యేలూరి ఆడియన్స్ ను రెండు గంటల పాటు చక్కగా తెరపై ప్రెజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ చక్కగా కుదిరాయి. నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను మంచి స్టార్ కాస్ట్ తో నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. వాసు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. చివర్లో వచ్చే ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి ఎడిటర్. దాంతో సినిమా ల్యాగ్ లేకుండా చాలా సినిమాను చక్కగా ప్రెజెంట్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించేలా ఉంది.
నటీనటల విషయానికొస్తే..
త్రిగుణ్ ఈ సినిమాలో తన ఎనర్జిటిక్ నటనతో అట్రాక్ట్ చేసాడు. లాకర్ టెక్నిషియన్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. అతని కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ లో రాణించాడు. హీరోయిన్ గా నటించిన మేఘా చౌదరి కూడా రొమాంటిక్, యాక్షన్ సీన్స్ బాగా నటించింది. యాక్ట్రెస్ గా మంచి ఫ్యూచర్ ఉంది. పోసాని పాత్ర బాగా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనూ, సెకెండాఫ్ లోనూ అతని క్యారెక్టర్ ప్రేక్షకులను నవ్వించేలా ఉంది. షాయాజీ షిండే పాత్ర పర్వలేదు. మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ ఎప్పటిలాగే ఎనర్జిటిక్ గా నటించారు. ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.
పంచ్ లైన్.. ‘జిగేల్’ ఆకట్టుకునే కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









