Karmanye Vadhikaraste: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న‘కర్మణ్యే వాధికారస్తే’.. ఆసక్తిరేకిస్తోన్న టీజర్..

Karmanye Vadhikaraste Teaser Talk: మహా భారతంలో భీష్మపర్వంలో మొదలైన మహాభారత సంగ్రామంలో భగవద్గీతలో ‘కర్మణ్యే వాధికారస్తే’ అని చెబుతాడు. కర్మ చేయడం మన వంతు.. ఫలితం నా మీద ఒదిలేయి చెబుతాడు. తాజాగా ఇదే  ‘కర్మణ్యే వాధికారస్తే’ సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై సంచలనం రేపుతోంది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 28, 2025, 08:59 PM IST
Karmanye Vadhikaraste: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న‘కర్మణ్యే వాధికారస్తే’.. ఆసక్తిరేకిస్తోన్న టీజర్..

Karmanye Vadhikaraste Teaser Talk:వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్నసంఘటనల  ఆధారంగా వైవిధ్యభరితమైన కథతో  తెరకెక్కిన చిత్రం "కర్మణ్యే వాధికారస్తే". ఈ నేరమర  ప్రపంచంలో జరిగే సంఘటలను  కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొవాల్సి వచ్చిందనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను అమర్ దీప్ చల్లపల్లి డైరెక్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్ లోనే తన డైరెక్షన్ తో  ఆకట్టుకున్నారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వ్యవహరించారు.

Add Zee News as a Preferred Source

భాస్కర్ సామల సినిమాటోగ్రఫీ అందించారు. గ్యానీ సంగీతం  అందించారు. కథ- సంభాషణలు శివకుమార్ పెళ్లూరు అందించారు. శత్రు, బ్రహ్మాజీ, 'మాస్టర్' మహేంద్రన్ ఇతర లీడ్ రూల్స్ లో నటించారు. పృథ్వీ, శివాజీ రాజా, శ్రీ సుధా, బెనర్జీ, అజయ్ రత్నం తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఐరా దయానంద్ రెడ్డి ఈ చిత్రం తో నటుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు.  ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ తో పాటు విశాఖ పట్నం సహా పలు ప్రాంతాల్లో జరుపుకుంది. ప్రస్తుతం ప్రసాద్ ల్యాబ్స్ తో పాటు సారథి స్టూడియోస్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ విభిన్నమైన యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి టీజర్ విడుదలై సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా నిలిచి చిత్రం పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ చిత్రంలో బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్ మహేంద్ర, బెనర్జీ, పృథ్వి, శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా, కృష్ణ భట్ కొత్తగా  పరిచయం అవుతున్నారు. ఇరా దయానంద్, అయేషా,రెహానా ఖాన్ తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతున్నారు.

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News