)
Karmanye Vadhikaraste: ఇపుడొస్తోన్న రొటిన్ సబ్జెక్ట్స్ తో కాకుండా కాస్త డిఫరెంట్ కంటెంట్ తో ‘కర్మణ్యే వాధికారస్తే’ సినిమా రాబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీగా ఉన్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. త్వరలో సెన్సార్ కూడా పూర్తి చేసుకోనుంది. 'కర్మణ్యే వాధికారస్తే' అనే పదం మహా భారతంలోని భీష్మ పర్వంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తాడు. అందులోని పదమే.. ‘కర్మణ్యే వాధికారస్తే’. దాని అర్థం "పని చేసే హక్కు నీకుంది, ఫలితం మీద కాదు".
టైటిల్ కి అనుగుణంగా కథ కూడా చాలా గ్రిప్పింగ్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ కథలో బ్రహ్మాజీ, శత్రు, 'మాస్టర్' మహేంద్రన్ వారి నటన తో ఆకట్టుకున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో శివాజీ రాజా, అజయ్ రత్నం, శ్రీ సుధా కృష్ణ భట్, ఇరా దయానంద్, అయేషా, రెహానా ఖాన్, జయరావు, బాహుబలి మధు తదితరులు ఇతర లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు.
‘కర్మణ్యే వాధికారస్తే’ స్టోరీ విషయానికొస్తే.. ఇదో సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. స్టూడెంట్ హత్యలు, మిస్సింగ్ కేసులు, కిడ్నాప్ ఇలా మనం ప్రతిరోజూ టీవిలో పేపర్స్ లో చూసే నిజ జీవిత సంఘటనల ఆధారంగా నిర్మించారు. . ఇటీవలే ట్రైలర్ విడుదలై సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. కొన్ని రోజులు ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 19 న రిలీజ్ కు రెడీ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.