సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జోడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కిల్లర్ ఆర్టిస్ట్’. ఎస్ జేకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాణంలో రతన్ రిషి డైరెక్ట్ చేశాడు. ఈ శుక్రవారం థియేట్రికల్ గా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమాలో కాలకేయ ప్రభాకర్, నేహా మాధురి, భద్రం, బిగ్ బాస్ సోనియా ఆకుల, జబర్దస్త్ వెంకీ, తాగుబోతు రమేష్, సత్యం రాజేష్ సుదర్శన్ ఇతర లీడ్ రూల్స్ లో యాక్ట్ చేశారు. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూడాలి.
స్టోరీ విషయానికొస్తే..
విక్కీ (సంతోష్) చెల్లెలు స్వాతి (స్నేహ మాధురి)ని అతను ఇంట్లో లేనపుడు ఎవరో కొంత మంది విక్కీ చెల్లెలును దారుణంగా రేప్ చేస్తారు. దీంతో తీవ్ర రక్తస్రావమై ఆమె కన్నుమూస్తుంది. దీంతో విక్కీ డిప్రెషన్ లోకి జారుకుంటాడు. అతన్ని మార్చాలని అతని ప్రియురాలు జాను (క్రిషేకా పటేల్) ప్రయత్నిస్తూ ఉంటుంది. అదే టైమ్ నగరంలో పిచ్చి రవి అనే ఓ సైకో అందరినీ ఆడవాళ్లను చంపేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడ తన ఆనవాలుగా ఓ హీరోయిన్ మాస్క్ వేస్తూ తానే ఆ హత్య చేసినట్టు క్లూ ఇస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆ సైకోను పోలీసులు పట్టుకుంటారు. అయితే.. తన చెల్లి చనిపోయిన సమయంలో కూడా ఇంట్లో ఓ హీరోయిన్ మాస్క్ కనిపిస్తుంది. దీంతో ఆ సైకోనే తన చెల్లిని చంపాడనుకుంటాడు. అంతేకాదు అతన్ని ఎలాగైన మట్టుపెట్టాలనుకుంటాడు. ఆ తర్వాత అతన్ని చంపే క్రమంలో తన చెల్లెలను చంపింది ఆ సైకో కాదని విక్కీకి తెలుస్తోంది. అదే సైకో హీరోయిన్ జానుతో పరిచయం ఉంటుంది. ఇంతకీ విక్కీ చెల్లెలను ఎవరు చంపారు.. ? సైకో రవికి హీరోయిన్ తో ఉన్న రిలేషన్ ఏమిటి? చివరకు తన చెల్లిని చంపిన వారిపై హీరో ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు హీరో చెల్లెలును ఎవరో రేప్ చేసి చంపేస్తారు. అతన్ని ఎలాగైన పట్టుకొని మట్టుపెట్టాలన్న స్టోరీ రెగ్యులర్ సినిమాల్లో ఉండే కథే అని చెప్పాలి. దాన్ని దర్శకుడు తెరపై ఎలా తెరకెక్కించాడనేదే ‘కిల్లర్ ఆర్టిస్ట్’ స్టోరీ. కానీ కథ పాతదే అయినా.. దర్శకుడు స్క్రీన్ ప్లే ను కొత్తగా రాసుకున్నాడు. మొత్తంగా ఓ సైకో .. సిటీలో వరుసగా అమ్మాయిలను మర్డర్ చేయడం అనేది రొటీన్ పాయింట్ అయినా.. దాన్ని తెరపై ప్రేక్షకులు సీటుపై కదలకుండా.. తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. ముందుగా సైకోనే తన చెల్లిని చంపాడనుకుంటాడు హీరో. కానీ ప్రీ క్లైమాక్స్ సీన్ లో అతను తన చెల్లెలును చంపలేదనే విషయం తెలుసుకొని.. క్లైమాక్స్ లో అసలు హంతకుడు ఎవరన్నది కనిపెట్టడం లాంటిది లాజిక్ అందుకున్నా.. కన్విన్సింగ్ గా చెప్పగలిగాడు. చివరాఖరిలో ఓ మెసేజ్ ఇవ్వడం ఆకట్టుకుంటుంది. సినిమాలో సిస్టర్ - బ్రదర్ సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయింది. ఓవరాల్ గా దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉందనే చెప్పాలి. సినిమాటోగ్రఫీతో పాటు విజువల్స్ బాగున్నాయి. సినిమాలో ఆర్ఆర్ బాగుంది.
నటీనటుల విషయానికొస్తే..
ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సంతోష్ ఈ సినిమాలో హీరో తన నటనతో మెప్పించాడు. చెల్లెలు చనిపోతే.. పడే బాధ, కోపం వంటి అంశాల్లో సంతోష్ యాక్టింగ్ బాగుంది. క్రిషేక పటేల్ ఉన్నంతలో క్యూట్ గా ఆకట్టుకుంది. అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసింది. చెల్లెలు పాత్రలో నటించిన స్నేహ మాధురి నటన పర్వాలేదు. కాలకేయ ప్రభాకర్.. సైకో గా తన క్యారెక్టర్ కు న్యాయం చేశాడు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
పంచ్ లైన్.. కిల్లర్ ఆర్టిస్ట్.. ఆకట్టుకునే సైకో పాథ్ థ్రిల్లర్..
రేటింగ్..2.75/5
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









