Krishna Leela Review: ‘కృష్ణ లీల’ మూవీ రివ్యూ..

Krishna Leela Review: ఈ మధ్యకాలంలో హీరోలు తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి మెగా ఫోన్ పట్టి స్టార్, కెమెరా, యాక్షన్ అంటూ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ కోవలో దేవన్ అనే కొత్త కుర్రాడు తాను హీరోగా పరిచయం అవుతూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కృష్ణ లీల’. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీమియర్స్ ను ఒక రోజు ముందుగానే మీడియాకు ప్రదర్శించారు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.   

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 6, 2025, 05:34 PM IST
Krishna Leela Review: ‘కృష్ణ లీల’ మూవీ రివ్యూ..

ఈ మధ్యకాలంలో కుర్ర హీరోలు.. బడా డైరెక్టర్స్ ను నమ్ముకోకుండా..తామే కథను రెడీ చేసుకొని ఏకంగా మెగాఫోన్ పట్టుకుంటున్నారు. ఈ కోవలో దేవన్ కొత్త హీరో వెండితెరకు పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణ లీల’ ‘తిరిగొచ్చిన కాలం’ అనేది ట్యాగ్ లైన్. మరి ఈ సినిమాతో దేవన్ హీరోగా దర్శకుడిగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసాడా లేదా మన మూవీలో చూద్దాం.. 

Add Zee News as a Preferred Source

కథ విషయానికొస్తే.. 

కృష్ణ లీల కథ విషయానికొస్తే.. ‘విహారి’ అమెరికాలో యోగా గురువుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడు. తన చెల్లెలి పెళ్లి కోసం అమెరికా నుంచి హైదరాబాద్ వస్తాడు. ఇక్కడ తన చెల్లి పెళ్లిలో కలిసిన మినిష్టర్ కూతురు బృంద (ధన్య బాలకృష్ణ)ను చూసి .. తనను ఎక్కడో కలిసినట్టు చూసినట్టు ఆమెకు చెబుతాడు. దీంతో బృంద అక్కడే విహారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తోంది. అమ్మాయిలను లైన్ లోనే వేయడానికి ఇలాంటి పనికి మాలిన కథలు చెబుతున్నాడంటూ ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది. అయితే.. విహారికి ..బృందకు గత జన్మ తాలుకూ అనుబంధం ఉంటుంది. అంతేకాదు ఆమె వెంట పడుతూ ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె మాత్రం అతని తిరస్కరిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో విహారి.. బృందను చంపానంటూ పోలీసులకు లొంగిపోతాడు. తీరా పోలీసులు ఆరా తీస్తే ఆమె బతికే ఉంటుంది. ఇంతకీ విహారి ఎందుకు బృందను చంపకపోయినా.. చంపినట్టు ఎందుకు పోలీసుల దగ్గరకు వెళ్లాడు. చివరకు బృందకు కూడా గత జన్మ గుర్తుకు వచ్చి చివరకు ఒప్పుకుందా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. 

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

పునర్జన్మల నేపథ్యంలో తెలుగు పలు చిత్రాలు వచ్చాయి. ఒకప్పటి మూగ మనసులు, జానకి రాముడు నుంచి మొదలు పెడితే.. మగధీర, అరుంధతి, శ్యామ్ సింగరాయ్ వరకు అన్ని సినిమాల్లో పునర్జన్మల నేపథ్యాన్ని చూసాము. ఆయా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచాయి. ఇపుడు హీరో కమ్ దర్శకుడు ఇదే హిట్ ఫార్ములాతో ‘కృష్ణ లీల’ సినిమాను తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ వాళ్ల కుటుంబ నేపథ్యాల పరచయంతో సాగుతుంది. ఒక బృందను తన చెల్లి పెళ్లి చూసి ఆమెతో జన్మజన్మల బంధమున్నట్టు ఆమె వెంట పడటం.. ఆమె అతని ప్రేమను తిరస్కరించడం వంటివి రొటిన్ గా అనిపిస్తాయి. అయితే హీరోయిన్ కాలేజీ పరిచయ సన్నివేశాలు కాస్త అతి అనిపిస్తాయి. ఒక హీరో మినిస్టర్ కూతురును చంపానని పోలీసులకు లొంగిపోవడం.. కానీ ఆమె చనిపోలేదనే విషయం తెలుసుకొని పోలీసులు షాక్ తింటారు. ఎందుకు విహారి .. బృందను చంపానని చెప్పడం వంటి సీన్స్ సినిమా సెకాండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాడు. 

అయితే ఈ చిత్రంలో గత జన్మలో విహారి..శివగా.. ద్రాక్షాయణిగా.. ఉన్న  బృందను ఎందుకు చంపాడనే ట్విస్ట్ ఆసక్తి రేకెత్తిస్తోంది. హీరోగా పరిచయం అవుతూ డైరెక్టర్ గా ఈ సినిమాను హ్యాండిట్ చేసిన విధానం బాగనే ఉంది. ఈ కాన్సెప్ట్ ను ఇంకాస్త బెటర్ గా చెప్పి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఇక హీరోయిన్ తనను ప్రేమించాలని కోర్టుకు ఎక్కడం వంటి సీన్స్ కొత్తగా అనిపిస్తాయి. మొత్తంగా తొలి ప్రయత్నంలోనే ఇలాంటి టఫ్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం మెచ్చుకోవాల్సిందే. నటుడిగా డైలాగ్ వెర్షన్ ఇంకాస్త మెరుగు పడాలి. డైలాగ్ డెలివరిలో అక్కడక్కడ తడబడ్డాడు. కానీ ఓవరాల్ గా చూసుకుంటే తొలి సినిమాలో నటించడంతో పాటు డైరెక్షన్ ను హ్యాండిల్ చేయడం వంటివి దేవన్ గట్స్ ఏంటో సూచిస్తాయి. పునర్జన్మల నేపథ్యాన్ని కృష్ణ తత్వాన్ని మిక్స్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు.  నిర్మాణ విలువలు పర్వాలేదు. భీమ్స్ సిసిరోలియే మ్యూజిక్ ఓ మోస్తరుగా ఉంది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ కాస్త ట్రిమ్ చేసుంటే బాగుండేది. 

నటీనటుల విషయానికొస్తే.. 

కొత్త నటుడైనా దేవన్ తానే నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటన పరంగా పర్వాలేదనిపించాడు. డైలాగ్స్ పలికే విధానంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. దేవన్ రెండు పాత్రల్లో వేరియేషన్ చూపించాడు. ధన్య బాలకృష్ణ మోడ్రన్ కాలేజి పొగరుబోతు అమ్మాయి పాత్రలో ఇరగదీసింది. గత జన్మలో గ్రామీణ ప్రాంత యువతిగా అదరగొట్టింది. సీనియర్ నటుడు వినోద్ కుమార్, పృథ్వీ సహా ఇతర పాత్రల్లో నటించిన నటీనటులు పర్వాలేదనింపించారు.  

పంచ్ లైన్..  పునర్జన్మల కృష్ణతత్త్వం.. కృష్ణ లీల

రేటింగ్: 2.5/5

Also Read:​  మీ ఏజ్ ప్రకారం రోజు ఎంత లిక్కర్ తీసుకోవాలి.. డాక్టర్లు ఏం చెబుతున్నారు..

Also Read:​  చిరంజీవికి అమ్మగా.. అక్కగా.. చెల్లిగా..భార్యగా యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News