Jaya Ho Ramanuja: లయన్ డాక్టర్ సాయి వెంకట్ టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘జయహో రామానుజ’. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అమెరికన్ నటి జో శర్మ కథానాయికగా నటిస్తోంది. సుమన్, ప్రవళ్లిక కీక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ఆడియన్స్ ముందుకు వస్తోంది. తాజాగా ఈ మూవీ సాంగ్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. లయన్ సాయి వెంకట్ నాకు మంచి మిత్రులు. ఆయన ‘జయహో రామానుజ’ వంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు అంటే.. ఇది చిన్న సినిమా అనకూడదు. ఈ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయడంలో మా వంతు సపోర్ట్ చేస్తామన్నారు. జయహో రామానుజ సాయి వెంకట్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నామన్నారు.
నిర్మాత, సినీ జర్నలిస్ట్ సురేష్ కొండేటి మాట్లాడుతూ - "జయహో రామానుజ" పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించి సాయి వెంకట్ కి గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
సింగర్ పద్మ మాట్లాడుతూ - "జయహో రామానుజ" చిత్రంలో నేను పాట పాడాను. ఈ సాంగ్ పాడమని సాయి వెంకట్ ఎంకరేజ్ చేశారు. సింగర్ కావాలనే నా కల ఈ మూవీతో తీరిందన్నారు. ఈ సినిమా విజయవంతం కావాలని కోరారు.
దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – మన తెలుగు రాష్ట్రాల్లో రామానుజాచార్యుల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ తమిళనాట ప్రతి ఒక్కరికీ ఆయన ఎవరో తెలుసు. చినజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారికి బాగా ఆయన గురించి అందరికీ తెలిసింది. తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియజేసే ప్రయత్నంలోనే ఈ చిత్రాన్ని రూపొందించాను. శ్రీ వెంకటేశ్వర స్వామికే గురువు లాంటి వారు రామానుజులు. వెంకటేశ్వరుడికి శంఖు చక్రాలు రామానుజాచార్యుల వారే బహూకరించారు. కమల్ హాసన్ సోషల్ మూవీలో 10 పాత్రలు చేశారు. కానీ పౌరాణికంలో ఎవరూ 11 పాత్రల్లో నటించలేదన్నారు. నేను "జయహో రామానుజ" చిత్రంలో 11 పాత్రలు చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నా అన్నారు. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ చేయాలని మిత్రులు ఇచ్చిన సలహాతో ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ,కన్నడ, హిందీ, సంస్కృతంతో పాటు మిగతా ప్రపంచ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
నిర్మాత ప్రవళ్లిక మాట్లాడుతూ –"జయహో రామానుజ" వంటి భారీ చిత్రాన్ని నేను నిర్మించగలను అని నమ్మి నన్ను సపోర్ట్ చేస్తున్న నాన్నకు ధన్యవాదాలు. ఆయన ప్రోత్సాహం లేకుంటే నేను ఈ సినిమా నిర్మించే దాన్ని కాదన్నారు. రాజమౌళి సినిమాలు కూడా రిలీజ్ వాయిదా పడుతుంటాయి. క్వాలిటీ కోసం కొంత టైమ్ తీసుకోవడం మంచిదే. భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో జయహో రామానుజ చిత్రాన్ని నిర్మించామన్నారు. త్వరలోనే మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల తేదిని అనౌన్స్ చేయనున్నాము. ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









